ఎక్కడ మొదలుపెట్టామో తిరిగి అక్కడికి రావాల్సిందే. టెక్నాలజీ పరంగా ప్రపంచం అభివృద్ది పదంలో దూసుకుపోతున్నది. టెక్నాలజీని పట్టుకొని అంతరిక్షంలోకి, ఇతర గ్రహాల మీదకు పరుగులు తీస్తున్నారు. టెక్నాలజీని విచ్చలవిడిగా వినియోగించుకోవడం వలన పర్యావరణం దారుణంగా దెబ్బతింటోంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా దృవప్రాంతాల్లో మంచు కరిగిపోతున్నది. పెరుగుతున్న జనాభాకు తగిన విధంగా స్థలం నివశించేందుకు స్థలాలు లేకపోవడంతో అడవులను నరికేస్తున్నారు. డీఫారిస్ట్రేషన్ కారణంగా వేడి పెరుగుతున్నది.
Read: గుండె చప్పుడును వినడం కాదు… ఎప్పుడైనా చూశారా?
పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. దీంతో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్, సోలార్ తో నడిచే వాహనాలను వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. దీంతో చాలా మంది వాహనాలను పక్కన పెట్టి పాత రోజుల్లో మాదిరిగా సైకిల్, లేదా కాలినడకను నమ్ముకొని పనులు చక్కబెట్టుకుంటున్నారు. పబ్లిక్ వాహనాల్లో ప్రయాణం చేసేందుకు కొంతమంది ఆసక్తి చూపుతున్నారు. ఏదైతేనేం పర్యావరణాన్ని తగ్గించేందుకు ప్రజల్లో కొంతమేర మార్పులు వస్తున్నాయని చెప్పుకోవచ్చు.