గత కొన్ని రోజులుగా, ఢిల్లీలో ఉష్ణోగ్రత తగ్గింది, కానీ ఖచ్చితంగా మంచు కురిసేంత చలి లేదు! ఢిల్లీలోని యమునా నదిలో తేలియాడే మంచులా కనిపించే తెల్లటి పదార్థంతో యుమునా నది అంతా పూత పూసిట్టు ఉంది. కానీ ఇది మంచు కాదు. ఇది నీటి కాలుష్యం ఫలి తంగా నదిని కప్పి ఉంచిన విషపూరిత నురుగు. పరిశ్రమలు, కర్మాగా రాల నుండి విడుదలయ్యే కాలుష్యం నదిలో అమ్మోనియా స్థాయి 3 పార్ట్స్ ఫర్ మిలియన్‌కు పెరగడం వల్ల యమునా నదిలో చాలా కాలు ష్యం ఏర్పడింది. వారాంతంలో, యమునా నదిలో అమ్మోనియా స్థాయి పెరగడంతో ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాను సైతం బంద్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తీవ్రమైన కాలుష్యం వల్ల యము న నది తీర ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కార్తీక మాసం సందర్భంగా జరిగే ఛత్ పూజతో కాలుష్య స్థాయి పెరగనుందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ఛత్ పూజ సందర్భంగా ప్రజలు యమునాలో మునుగుతారు
కార్తీక మాసంలో వచ్చే ఛత్ పూజ మొదటి సోమవారం అనేక మంది భక్తులు నురుగు పూసిన యమునా నదిలో స్నానాలు చేస్తున్నారు. దీని ఫలితంగా అనేక దుష్పప్రభావాలు ఏర్పడతాయి. అయినా ప్రజ లు అలానే యమునా నదిలో మునుగుతున్నారు. గత కొన్నేళ్లుగా ఢీల్లీని ఈ సమస్య పట్టిపీడిస్తుంది. స్థానికులు ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ ఈ విషయం గురించి ప్రభుత్వానికి చాలాసార్లు చెప్పిన ప్పటికీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ఢిల్లీకి భారీ ముప్పు తప్పదన్నారు.
ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (DDMA) ఈ ఏడాది యమునా తీరంలో ఛత్ పూజను నిషేధించింది. అయితే ఢిల్లీలోని యమునా తీరం మినహా కొన్ని నిర్దేశించిన ప్రాంతాల్లో ఛత్ వేడుకలను అనుమ తించింది. బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రజలు నిర్వహిం చుకునే ఛత్ పూజలో మోకాళ్ల లోతు నీటిలో సూర్య భగవానుడికి ప్రార్థ నలు చేస్తారు. మూడు రోజుల పాటు ఈ పూజలు నిర్వహిస్తారు. ఈ సంవత్స రం ప్రారంభంలో, ఢిల్లీ ప్రభుత్వం యమునా నదిని శుద్ధి చేయడానికి దాన్లో ఏర్పడే మురుగును తగ్గించడానికి తొమ్మిది పాయిం ట్ల కార్యాచ రణ ప్రణాళికను రూపొందించింది. ఇదిలా ఉంటే దీనిపై ఆమ్ ఆద్మీ, బీజేపీ ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుం టున్నారు. సోమవారం, యమునా నదిలో కాలుష్య సమస్యపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆమ్ ఆద్మీపై మాటల దాడికి దిగాయి.