అత్యంత ఉత్కంఠగా అత్యున్నత సమరం…వ్యూహప్రతివ్యూహాల్లో అధికార, విపక్షాలు..విపక్ష కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా…వాజ్ పేయి హయాంలో కేంద్రమంత్రిగా పని చేసిన సిన్హా..ఒకప్పటి తన సొంత పార్టీపైనే ఇప్పుడు పోటీకి సై…ఊహకందని వ్యూహాలతో కాషాయదళం.మహారాష్ట్రలోని ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలకు వల ..రాష్ట్రపతి ఎన్నికల్లో మెజారిటీ కోసమేనని జోరుగా ప్రచారం..దేశ ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు రాష్ట్రపతి ఆర్టికల్ 53, 74(2) ప్రకారం రాజ్యాంగ పరిరక్షకుడిగా సర్వాధికారాలు..రాష్ట్రపతి పాలన, ఆర్థిక అత్యవసర స్థితి విధించే అధికారం..భారత రాష్ట్రపతి ఎన్నికల…
నల్లు ఇంద్రసేనారెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు. అప్పట్లో వేళ్లమీద లెక్కపెట్టే బీజేపీ నేతల్లో ఒకరు. గతంలో బీజేపీకి రాష్ట్ర చీఫ్‌గానూ పనిచేశారు ఇంద్రసేనారెడ్డి. ప్రస్తుతం బీజేపీలో ఇతర పార్టీల నాయకుల చేరికలకు సంబంధించిన కమిటీకి ఛైర్మన్‌గా ఉన్నారు. ఇంద్రసేనారెడ్డితోపాటు ఆ కమిటీలో ఏడుగురు పార్టీ నేతలు సభ్యులు. తెలంగాణలో బీజేపీలో ఎవరైనా చేరాలి అని అనుకుంటే ఈ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. వచ్చేవారి వల్ల పార్టీకి ఏ మేరకు లాభం..…
వి. హన్మంతరావు. తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు. ఆయన నియోజకవర్గం అంబర్‌పేటలో అడుగు పెట్టాలంటే పార్టీ నేతలు హడలిపోతారు. పేరుకు సీనియరైనా.. నియోజకవర్గాన్ని VH అంతగా పట్టించుకోవడం లేదనే విమర్శ కాంగ్రెస్ వర్గాల్లోనే ఉందట. ఎన్నికల్లో VH పోటీ చేసే పరిస్థితి లేదన్నది కొందరి వాదన. అలాగని అంబర్‌పేట కాంగ్రెస్‌లో బలమైనే నేతనూ తయారు చేయడం లేదట. 2018 ఎన్నికల్లో పొత్తులో బాగంగా.. అంబర్‌పేటను కోదండరాం పార్టీ తెలంగాణ జనసమితికి కేటాయించారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల కోసం…
మతుకుమిల్లి శ్రీభరత్. గీతమ్ చైర్మన్‌గా, హీరో బాలకృష్ణ చిన్న అల్లుడుగా సుపరిచితం. గత ఎన్నికల ముందు అనూహ్యంగా శ్రీభరత్ పేరును తెరపైకి తెచ్చింది టీడీపీ. వైజాగ్ ఎంపీగా పోటీ చేయించింది. హోరాహోరీగా సాగిన త్రిముఖ పోటీలో భరత్ 4 వేల ఓట్ల తేడాతో పోడిపోయారు. కాకపోతే విశాఖ లోక్‌సభ పరిధిలోని 4 అసెంబ్లీ స్ధానాలను టీడీపీ గెలుచుకుంది. విశాఖ పశ్చిమ, దక్షిణ, తూర్పు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలకు బంపర్ మెజార్టీ వచ్చినప్పటికీ ఎంపీగా శ్రీభరత్ ఓటమి అప్పట్లో…
వచ్చే నెలలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదికైన తరుణంలోనే ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. 2, 3 తేదాల్లో జరిగే సమావేశాల ఏర్పాట్లలో ఈటలకు కూడా బాధ్యతలు అప్పగించింది పార్టీ. కానీ.. కొన్నాళ్లుగా బీజేపీలో తనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే భావనలో మాజీ మంత్రి ఉన్నట్టు టాక్. ముందరి కాళ్లకు బంధాలేస్తున్నారనే ఫీలింగ్‌లో ఉన్నారట. బీజేపీలోని కొందరు నాయకుల వైఖరి పట్ల కినుకతో ఉన్నట్టు చెబుతున్నారు. దాంతో బీజేపీలో ఈటల…
విజయారెడ్డి. కాంగ్రెస్ దివంగత నేత PJR కుమార్తె. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో టీఆర్ఎస్ కార్పొరేటర్. రాజకీయ ప్రయాణాన్ని వైసీపీ నుంచి మొదలుపెట్టిన ఆమె.. 2014లో ఖైరతాబాద్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత టీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారామె. ఖైరతాబాద్ డివిజన్ నుంచి రెండుసార్లు కార్పొరేటర్‌గా గెలిచారు. 2018లో మరోసారి ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి పోటీచేయాలని విజయారెడ్డి ఆశించినా.. టీఆర్ఎస్ మాత్రం దానం నాగేందర్‌కు ఛాన్స్ ఇచ్చింది. తనకు రావాల్సిన సీటును దానం తన్నుకుపోయారని…
దేశంలో రాష్ట్రపతి ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఒకవైపు బీజేపీ నేతలు మరోవైపు విపక్ష నాయకులు ఎవరి ప్రయత్నాలలో వారు ఉన్నారు. అధికార బిజెపి ఇప్పటికే పలు రాజకీయ పార్టీలతో మంతనాలు జరుపుతోంది. ఇటు విపక్షలు కూడా అభ్యర్థిని వెతికే పనిలో ఉన్నాయి. ఇప్పటి వరకు రెండు పక్షాల నుంచి అభ్యర్థులపై క్లారిటీ రాలేదు. విపక్షాలు ఒక తాటిపైకి వచ్చే ప్రయత్నాలు అయితే తెరవెనక గట్టిగానే జరుగుతున్నాయి. ఈ నెల 21న మరోసారి విపక్ష పార్టీలు మళ్లీ భేటీ…