KTR : ఇది ఆత్మహత్య కాదు.. హైడ్రా అనే అరాచక సంస్థతో రేవంత్ రెడ్డి చేయించిన హత్య
- హైడ్రా అనే సంస్థ కారణంగానే బుచ్చమ్మ బలవన్మరణం పొందారు
- మీ దిక్కుమాలిన చర్యల కారణంగా పేదలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి
- ఇంత అమానవీయంగా ప్రవర్తించాలా? : కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైడ్రా కూల్చివేతల భయం కారణంగా కూకట్ పల్లిలో ప్రాణాలు కోల్పోయిన బుచ్చమ్మ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అర్థం, పర్థం లేకుండా ఆనాలోచితంగా గుడ్డెద్దు చేలో పడినట్లు ఇష్టమొచ్చినట్లు కూకట్ పల్లిలోని నల్ల చెరువు వద్ద కూల్చివేతలు చేశారని ఆయన ఆరోపించారు. హైడ్రా అనే బ్లాక్ మెయిల్ సంస్థను పేదల మీదకు ఉసిగొల్పి…నోటీసులు ఇవ్వకుండానే మీ ఇళ్లు కూలగొడుతామంటూ భయానక వాతావారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిందని, పిల్లలు పుస్తకాలను తీసుకుంటామంటే కూడా తీసుకొనివ్వకుండా పేదల ఇళ్లు కూలగొడుతున్నారన్నారు. ఎక్కడ నా ఇల్లు కూలగొడుతారమోనని 52 ఇళ్ల బుచ్చమ్మ అనే మహిళ మూడు రోజులు ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్నారని, వాళ్ల కుటుంబాన్ని చూస్తే బాధనిపిస్తోంది. ఎంతో కష్టపడి మా బిడ్డలకు ఉపయోగపడతదని ఇళ్లు కట్టామని బుచ్చమ్మ కుటుంబ సభ్యులు చెబుతున్నారన్నారు కేటీఆర్. ఆలోచన, ప్రణాళిక, పద్దతి లేకుండా చేశారు. వాళ్లే పర్మిషన్లు ఇచ్చి ట్యాక్స్ కట్టించుకొని వాళ్లే ఇల్లు కూలగొడుతారంట, హైడ్రా అనే సంస్థ కారణంగానే బుచ్చమ్మ బలవన్మరణం పొందారని కేటీఆర్ మండిపడ్డారు. ఇది ఆత్మహత్య కాదు. హైడ్రా అనే అరాచక సంస్థతో రేవంత్ రెడ్డి చేయించిన హత్య అని ఆయన ఆరోపించారు.
Terror Threat To Taj Hotel: మరోసారి ఉగ్రవాదుల లక్ష్యంగా మారిన తాజ్ హోటల్.. ఈ సారి ఢిల్లీ కాదు
Also Read
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
అంతేకాకుండా..’మీ దిక్కుమాలిన చర్యల కారణంగా పేదలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. వేదశ్రీ అనే పాప ఏడుస్తూ పుస్తకాలు తీసుకుంటామంటే కూడా తీసుకోనివ్వకుండా ఇళ్లు కూలగొట్టారు. ఇంత అమానవీయంగా ప్రవర్తించాలా? ఈ రాష్ట్రంలో పేద వాళ్లకు మాత్రమే చట్టాలున్నాయా? రేవంత్ రెడ్డి నీ అన్నకు మాత్రం ఎఫ్టీఎల్ లో ఉన్న ఇల్లుకు నోటీసులిస్తారా? పేదవాళ్లు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా తీసుకోనివ్వకుండా ఇల్లు కూల్చటమనేది ఇంతకంటే దిగజారిన, దిక్కుమాలిన చర్య ఏదైనా ఉంటుందా ? ఎన్నో హామీలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కడతాం, ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు అన్నారు. ఒక్క ఇళ్లు కట్టలేదు. కానీ ఎన్ని ఇళ్లు కూలగొట్టవో ప్రజలు గమనిస్తున్నారు. హైదరాబాద్ లో మాత్రమే కాదు ఊళ్లలో కూడా రేవంత్ రెడ్డి అరాచకం గురించి మాట్లాడుతున్నారు. నువ్వు నీ కేబినెట్ మంత్రులు ఏం చేస్తున్నారో ప్రజలంతా చూస్తున్నారు. హైడ్రా తో ఆర్థిక మంత్రికి ఏంటీ సంబంధం. ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన ఇస్తాడు. ఐదు మంది బిల్డర్ల పేరు చెబుతాడు. ఎందుకిదంతా బ్లాక్ మెయిల్ దందానా? నీ మంత్రులు, నీ తమ్ముళ్లకు ఇదే దందానా? పెద్ద పెద్ద బిల్డర్లను బెదిరించి వాళ్ల దగ్గర దందా చేసి చందాలు తీసుకోవటానినా నీ ప్రభుత్వం ఉన్నది. గరీబోళ్ల ఇళ్లు కూలగొట్టి హైడ్రా పేరుతో దందా చేస్తున్నారు.
బుచ్చమ్మ గారి మరణం ఆత్మహత్య కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య.. ఈ హత్య కేసు రేవంత్ రెడ్డి పైన ఆయన హైడ్రా పైన పెట్టాలి. బుచ్చమ్మ గారి కుటుంబానికి అండగా ఉంటాం. వారికి ఆర్థిక సాయం చేశాం. హైడ్రా బాధితులందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుంది. మీకు న్యాయసాయం చేస్తుంది. రాష్ట్రం మొత్తం మీద ఇవ్వాళ అరాచకం నడుస్తోంది. గరీబోళ్ల పొట్టకొట్టే ప్రభుత్వ చర్యలపై పోరాడుతాం, న్యాయ పోరాటం కూడా చేస్తాం. గరీబోళ్లకు మేము అండగా ఉంటాం. వారికి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తోడుగా ఉంటారు. హైదరాబాద్ ప్రజలు మాకు ఓటు వేసినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పగ, కసి పెంచుకుంది. కచ్చితంగా ఈ ప్రభుత్వం మీద మనందరం తిరగబడాల్సిందే.’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Jaya Kishori: వివాదంలో ఆధ్యాత్మిక బోధకురాలు జయ కిషోరి.. నెట్టింట విమర్శలు
తాజావార్తలు
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం.. !
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!