Harish Rao : రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు… ప్రజా పీడన అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 11 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వర్గానికి మేలు చేయలేదని, ధర్నాలతో రాష్ట్రం అట్టుడికిపోతుందన్నారు హరీష్ రావు. నోటికి వచ్చినట్లు మాట్లాడటం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డికి తెలుసు అని, హామీలు అమలు చేయమని అడిగితే నోటికి వచ్చినట్లు సీఎం తిడుతున్నారన్నారు. కేసీఆర్ పధకాలను రేవంత్ రెడ్డి కొనసాగించడం లేదని, రెండు పంటలకు కేసీఆర్ రైతు బంధు ఇచ్చారని, రైతులకు రైతుబంధు రాలేదన్నారు. రాష్ట్రంలో పత్తి రైతులకు మద్దతు ధర రావడం లేదని ఆయన మండిపడ్డారు. రైతులు రోడ్డు ఎక్కితే రేవంత్ రెడ్డి మొద్దునిద్ర పోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వరి పండించిన రైతులకు బోనస్ రావడం లేదని, అశోక్ నగర్ కు వెళ్లి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు మాయమాటలు చెప్పారన్నారు. 2 లక్షల ఉద్యోగాలకు కనీసం నోటిఫికేషన్ అయినా ఇచ్చారా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఫీజు రియంబర్ మెంట్ కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదని, ఉద్యోగులను రేవంత్ రెడ్డి మోసం చేశారన్నారు హరీష్ రావు.
Gary Kirsten: మాట వినరు? మద్దతు తెలపరు.. పాకిస్థాన్ క్రికెట్ కోచ్ రాజీనామా
అంతేకాకుండా..’బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు 15 డీఏలు ఇచ్చింది. కనీసం ఒక్క డీఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు ఒక్క రూపాయి ఇవ్వడం లేదు. రేవంత్ రెడ్డికి విషం తప్ప విజన్ లేదు. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి నన్ను బాడీ షేమింగ్ చేశారు. మూసీ విషయంలో కేటీఆర్ రేవంత్ రెడ్డి అవినీతిని బయటపెట్టారు. కేటీఆర్ కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి డ్రామా అట్టర్ ఫ్లాఫ్ అయింది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు రోడ్డు ఎక్కుతున్నారు. ఫ్యామిలీ ఫంక్షన్ జరిగితే దుష్ప్రచారం చేస్తున్నారు. అది ఫార్మ్ హౌస్ కాదు ఇళ్ళు.. రేవ్ పార్టీ అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారా…? క్యారెక్టర్ ను దెబ్బతీయడం సరికాదు. కేటీఆర్, కేటీఆర్ సతీమణి వెళ్లారని అసత్య ప్రచారం చేస్తున్నారు. మా పైన కుట్రతో దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మూసీ పేరుతో ఢీల్లికి మూటలు పంపాలని అనుకుంటున్నారు. నల్గొండ జిల్లా రైతులతో రాజకీయం చేస్తున్నారు. మూసీ శుద్దిని ప్రారంభించింది కేసీఆర్. కాంగ్రెస్ ఎమ్మెల్సీ రోడ్డు ఎక్కిన పరిస్థితి చూస్తున్నాం.
రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఊడగొడుతున్నారు. పోలీసులు సెలవు కావాలంటే సర్వీసు నుండి తొలగిస్తున్నారు. పండుగ,పెళ్లిళ్ల సీజన్ లో ఎవరైనా 144 సెక్షన్ పెడతారా. కంచెలు లేని పాలన అని ఆంక్షల పాలన తెచ్చారు. బండి సంజయ్ తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి తానా అంటే బండి సంజయ్ తందానా అంటున్నారు. సీనియర్ మంత్రులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని బండి సంజయ్ అన్నారు. బండి సంజయ్ రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పని చేస్తున్నారు. బండి సంజయ్ రాష్ట్రంలో సమస్యలపై ఎందుకు స్పందించడంలేదు. ఆదానీ సిమెంట్ ఫ్యాక్టరీపై బీజేపీ ఎందుకు కొట్లాడటం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందా…ఆర్.ఎస్.బ్రదర్స్ ప్రభుత్వం నడుస్తోందా. పోలీస్ కానిస్టేబుల్స్ గురించి బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదు.’ అని హరీష్ రావు మండిపడ్డారు.
Ka Movie: కొత్తదనం ఫీల్ కాకుంటే సినిమాలు చేయను.. ఇప్పటికే అదేమాట మీదున్నా: కిరణ్ అబ్బవరం ఇంటర్వ్యూ