Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పేర్కొన్నారు. ఇక, పోలీసుల పిటిషన్ పై సోమవారం విచారణ జరగనుంది. అయితే, వంశీతో పాటు మరో ఇద్దరిని కూడా కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. కాగా, ఏసీఎంఎం కోర్టు వంశీకి 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం విజయవాడలోని సబ్ జైలులో ఉన్నారు.
Read Also: CM Chandrababu: స్వచ్ఛాంధ్ర, బీసీ సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
అయితే, గన్నవరంలోని టీడీపీ కార్యాలయం దాడి కేసులో విచారణ కొనసాగుతుండగానే.. కోర్టుకు వచ్చిన ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కేసును విత్ డ్రా చేసుకున్నారు. కేసు విత్ డ్రా చేసుకోవాలని వైసీపీ నేతలు కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడటంతోనే ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాడని బాధితుడి తమ్ముడు పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఘటనపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేయగా కేసులో ఏ1 ఉన్న వల్లభనేని వంశీని గురువారం ఉదయం హైదరాబాద్‌లో అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చి.. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో వంశీని పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.