French Man Murdered: పారిస్‌లో దారుణ ఘటన జరిగింది. గేమ్‌లో ఓడిపోయినందుకు 11 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. పారిస్ కు దక్షిణంగా 16 మైళ్ల దూరంలో ఉన్న ఎస్సోన్‌లోని ఎపినే-సుర్-ఓర్జ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, ఫిబ్రవరి 8వ తేదీన 11 ఏళ్ల లూయిస్ లాసల్లె కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన..12 గంటల తర్వాత శవమై కనిపించింది. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also: US-Israel: అమెరికాలో పర్యటించనున్న ఇజ్రాయెల్ సైన్యాధిపతి.. ఆసక్తిరేపుతున్న టూర్
అయితే, పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు తెలిపారు.. 23 ఏళ్ల నిరుద్యోగి ఓవెన్ ఎల్గా ఈ నెల ప్రారంభంలో ఫోర్ట్‌నైట్ గేమ్‌లో ఓడిపోయినందుకు కోపంలో మరొక గేమర్‌తో గొడవ పడ్డాడని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 7న మధ్యాహ్నం 1:50 గంటల ప్రాంతంలో లూయిస్ మిడిల్ స్కూల్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా నిందితుడు.. ఆమెను దోచుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆ అమ్మాయి మెడలో ఉన్న చైన్ తో పాటు మొబైల్ ఫోన్ దొంగిలించడనికి ప్రయత్నించగా.. ఆ బాలిక భయంతో అడవిలోకి పరుగులు తీసింది. ఇక, ఒంటరిగా దొరికిన లూయిస్ లాసల్లెను కత్తితో బెదిరించడంతో.. ఆమె కేకలు వేసింది.. దీంతో భయపడిన ఓవెన్ ఎల్గా ఒక్కసారిగా ఆ బాలికను కింద పడేసి పొడిచాడు అని పోలీసులు వెల్లడించారు.
Read Also: Mazaka : తెలుగు సినిమా చరిత్రలో మొదటిసారి షూటింగ్ లైవ్ స్ట్రీమింగ్
కాగా, లూయిస్ లాసల్లె శరీరం పక్కనే ఆమె ఫోన్ దొరికిందని, లైంగిక వేధింపులకు సంబంధించిన ఆధారాలు లేవని పోలీస్ అధికారులు తెలిపారు. అయితే, ఆమె చేతుల్లో పురుష DNAను కనుగొన్నామని చెప్పారు. ఇక, నిందితుడు గతంలో మరో అమ్మాయిని అడవుల్లోకి రప్పించడానికి ప్రయత్నించినప్పటికి.. ఆమె నిరాకరించిందని పేర్కొన్నారు.