Illegal Soil Mafia: కాకినాడ జిల్లా అన్నవరంలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. స్మశానంలో సమాధులు తవ్వుతుంది ఈ మట్టి మాఫియా.. సమాధులతో పాటు ముస్లిం స్మశాన భూమిని తవ్వుకుని వెళ్లి సొమ్ములు చేసుకుంటున్నారు. ఈ మట్టిని నూతన భవన నిర్మాణాల కోసం వ్యాపారులు తీసుకొని వెళ్తున్నారు. అయితే, ఇటీవల మృతి చెందిన వ్యక్తుల సమాధులకు సంబంధించి కళేబరాలు మాయం అయ్యాయని ముస్లిం మత పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇక, రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందులో, ఒక మృతదేహం కళేబరంను బయటకు రావడంతో పోలీసులు సమక్షంలో మసీదులో భద్రపరిచారు ముస్లిం మత పెద్దలు.. స్మశాన మట్టి ట్రాక్టర్లు ప్రోక్లైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అర్ధరాత్రి వేళల్లో మట్టిని తవ్వుకుని వెళుతున్నారు అని రెవిన్యూ అధికారులకి పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పాటు పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. ఇలాంటి, చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మట్టి మాఫియాకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.