Vallabhaneni Vamsi Wife: విజయవాడలోని సబ్ జైల్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆయన భార్య పంకజశ్రీ ఈ రోజు ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ సబ్ జైల్లో తన భార్తకు ప్రాణహాని ఉందన్నారు. వంశీని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు.. వెన్నుపూస నొప్పితో, శ్వాసకోస సమస్యతో ఆయన బాధపడుతున్నారు.. అలాంటి వంశీని మెంటల్ గా టార్చర్ చేస్తున్నారు అని ఆరోపిచింది. మానసికంగా ఆయనను కుంగ దీస్తున్నారు.. వంశీ ఉన్న బారక్ లో 60 సీసీ కెమెరాలు పెట్టారు.. నా భార్త ఆరోగ్యం బాగుందంటూ డాక్టర్లతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ఈ వ్యవహారం మీద కోర్టుకు వెళ్తాను అని వంశీ భార్య పంకజశ్రీ వెల్లడించారు.
Read Also: Fenugreek seeds: మెంతులతో ఆ వ్యాధికి చెక్ పెట్టెయండి..
ఇక, వైఎస్ జగన్ ఫోన్ చేశారు.. నాకు ధైర్యం చెప్పారు అని వంశీ భార్య పంకజశ్రీ తెలిపారు. వచ్చే వారం వంశీని కలుస్తానని జగన్ చెప్పారు.. వైసీపీ పార్టీ అన్ని రకాలుగా అండదండలుగా ఉంటుంది.. లీగల్ టీమ్ ని కూడా ఏర్పాటు చేశారు.. కేవలం 20, 000 కోసం తప్పుడు కేసులు పెట్టి టార్చర్ పెడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేసింది. కేస్ ఫ్యాబ్రికెట్ చేస్తున్నారు.. ఫాల్స్ అలిగేషన్లు వేస్తున్నారు.. వంశీకి టైల్ బోన్ ఫ్రాక్చర్ అయింది ఆరోగ్యం బాగోలేదని పేర్కొనింది. నేరం రుజువు కాకుండానే బంధించారు.. ఫాల్స్ కేస్ లో ఇంత పనిష్మెంట్ ఎందుకు అని ప్రశ్నించింది. కింద పడుకుంటున్నారు.. బెడ్ కావాలని రిక్వెస్ట్ చేస్తాం.. టార్చర్ల జైల్లో ఒక సెల్లో బంధించి ఎవరిని కలవానివ్వకుండ ఇబ్బంది పెడుతున్నారు అని పంకజశ్రీ చెప్పుకొచ్చింది.