Road Accident: యాదగిరిగుట్ట జిల్లాలోని చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు (మార్చ్ 26) తెల్లవారు జామున విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న భారీ కంటైనర్ ను వెనుక నుంచి రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీ కొన్నాయి. కాగా, ఈ ప్రమాదంలో సుమారు 13 మందికి పైగా గాయపడగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే, ఆరెంజ్ ట్రావెల్ బస్సు డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోవడంతో బయటకు తీయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఇక, ఈ రోడ్డు ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అలాగే, ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల ఆధారాలను సేకరిస్తున్నారు.