Tripurantakam: ఈ నెల 27వ తేదీన ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నిక జరగాల్సి ఉంది.. ఈ సమయంలో నాటకీయ పరిణాలు చోటు చేసుకున్నాయి.. ఎంపీపీ అభ్యర్థిగా ఉన్న ఆళ్ల ఆంజనేయరెడ్డి అరెస్ట్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.. ఫిర్యాదు ఆధారంగా ఎంపీపీ అభ్యర్థితో పాటు మరో వ్యక్తి సుబ్బారావుపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అటెంప్ట్ మర్డర్ కేసు, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.. దీంతో, వైసీపీ శ్రేణులు యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ ను ముట్టడించాయి.. విషయం తెలుసుకున్న ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్.. వైసీపీ శ్రేణులలతో కలిసి యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ కి చేరుకోవడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.. కేసును విచారిస్తున్న మార్కాపురం డీఎస్పీ నాగరాజును వైసీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ అట్రాసిటీ కేసు నమోదు విషయం పై చర్చించారు..
Read Also: My Doctor-David Warner: క్రికెటర్ డేవిడ్ వార్నర్‌తో ‘మై డాక్టర్’ భాగస్వామ్యం!
ఈ సందర్భంగా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ మాట్లాడుతూ.. త్రిపురాంతకం కాబోయే ఎంపీపీ ఆంజనేయరెడ్డిని కావాలనే అరెస్ట్ చేశారని అన్నారు.. నిన్నరాత్రి అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఒక టెర్రరిస్టులు, నక్సలైట్లు లా యర్రగొండపాలెం దాచిపెట్టి అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేశారని అన్నారు.. దెబ్బలు తగిలినట్టు ఒక్క సాక్ష్యం లేకుండా, హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్టు ఆధారం లేకుండా, ఒక గాయం లేకుండా 307 కేసు ఫైల్ చేశారని అన్నారు.. సంతోషంగా తిరుగుతున్న వ్యక్తి ఫిర్యాదు చేయడంతో విచారణ చేయకుండా కేసు నమోదు చేయడం దుర్మార్గమని అన్నారు.. ఈనెల 27న ఎంపీపీ ఎన్నిక ఉంది కాబట్టే.. టీడీపీ నాయకులు కలిసి కుట్రకు పాల్పడ్డారని అన్నారు.. ఒక ఎస్సై తన విధులను పూర్తిగా మర్చిపోయి. ఒక టీడీపీ కార్యకర్తల పని చేసి కావాలనే వైసీపీ కార్యకర్తలను ఎలక్షన్ లలో పాల్గొనకుండా చేశారని మండిపడ్డారు..
Read Also: My Doctor-David Warner: క్రికెటర్ డేవిడ్ వార్నర్‌తో ‘మై డాక్టర్’ భాగస్వామ్యం!
ఇక, ఆళ్ల ఆంజనేయరెడ్డి ని అక్రమంగా అరెస్ట్ చేసి రోజంతా తిప్పారని ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్.. హత్యాయత్నం చేశారు అని చెప్తున్న వ్యక్తి పై చిన్నపాటి గాటు కూడా లేదని.. ఏవిధంగా కేసును విచారణ చేయకుండా సాక్షులు లేకుండా ఒక ఓసీ వ్యక్తి పై ఏవిధంగా కేసు రిజిస్టర్ చేస్తారని అన్నారు.. 18 ఎంపీటీసీల్లో మొత్తం వైసీపీకి ఉన్నాయని.. టీడీపీ ఏవిధంగా గెలుస్తుందని నిలదీశారు.. ఒక ఎంపీటీసీకి టీడీపీ కండువా కప్పారు, వైసీపీ సీనియర్ నాయకుడిపై కేస్ పెడితే భయపడి ఎవరు రారు అని ఇలా పోలీసులను అడ్డుపెట్టుకొని ఒక తప్పుడు సంస్కృతికి తెరలేపారని దుయ్యబట్టారు.. .ఈ ఎన్నికలను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత పోలీసులు, ఎలక్షన్ కమిషన్, కలెక్టర్‌పై ఉంది.. వీరందరూ కలిసి సక్రమంగా చేస్తే ఇలాంటివి పునరావృతం కావని అన్నారు. 27వతేదీన ఈ ఎన్నికలపై నిఘా పెట్టాలని.. స్వతంత్రం గా వచ్చి ఎన్నికల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్..