Fake Seeds: ములుగు జిల్లాలో రైతు కమిషన్ పర్యటన తర్వాత కీలక పరిణామాలు నెలకొన్నాయి.. వెంకటాపురం, వాజేడు మండలాల్లో విత్తనోత్పత్తి పేరుతో మొక్కజొన్న సాగు చేయించిన మూడు కంపెనీలు.. అధిక దిగుబడి వస్తుందంటూ రైతులని సాకుకు పురిగొల్పిన కంపెనీ బ్రోకర్లు.. దళారుల మాటలు విని పెద్ద ఎత్తున మొక్కజొన్న సాగు చేసిన రైతులు.. కంకి దశలో గింజలు ఏర్పడకపోవడంతో భారీగా నష్టపోయారు. వ్యవసాయ శాఖ అధికారుల నివేదిక మేరకు 3 ఎకరాల్లో పంట నష్టపోయిన మొక్కజొన్న రైతులు.. పంట నష్టపోవడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.. దీంతో పాటు మొక్కజొన్న రైతుల ఆందోళనలతో అధికార యంత్రంగం దిగి వచ్చింది. రైతు కమిషన్ ములుగు జిల్లా పర్యటన తర్వాత కంపెనీల దళారులపై కేసు నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Read Also: Trump: ట్రంప్ మరో కీలక నిర్ణయం.. ఎన్నికల ప్రక్రియపై భారీ మార్పులు
ఇక, ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తన కంపెనీ దళారులపై కేసులు నమోదు చేశామని ఏటూరునాగారం ఏఎస్పి శివం ఉపాధ్యాయ తెలిపారు. నకిలీ విత్తనాలతో వాజేడు, వెంకటాపురం మండలాల్లో భారీగా రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. హైటెక్ కంపెనీకి చెందిన దళారీ సురేష్, బేయర్ కంపెనీకి చెందిన దలారి వేణుపై కేసు ఫైల్ అయింది.. అధిక దిగుబడులు వస్తాయని నకిలీ విత్తనాలు విక్రహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.