Ranveer Allahbadia: యూట్యూబర్ రణ్ వీర్ అల్హాబాదియాకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. పాస్ పోర్టును అతనకి తిరిగి ఇచ్చేయాలని ఇవాళ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. తిరుపతిలో జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో స్పాట్లోనే ఐదుగురు మృతిచెందారు.. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిపై పాకాల మండలం తోటపల్లి దగ్గర ఘోరు ప్రమాదం చోటు చేసుకుంది.. కంటైనర్ వాహనం కిందకు దూసుకెళ్లింది కారు.. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు..
Karre Gutta: గత ఆరు రోజులుగా కర్రె గుట్టలలో భద్రతా బలగాలు కూబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.. ఈ ఆపరేషన్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజాపూర్, తెలంగాణ సరిహద్దు కర్రె గుట్టలలో భారీ సొరంగాన్ని భద్రతా బలగాలు గుర్తించారు. ఈ సొరంగంలో ఒక ప్రాంతం నుంచి మరో మార్గం ద్వారా బయటికి వెళ్లేందుకు వీలుగా ఉందని భద్రతాదళాలు చెబుతున్నాయి.
Hyderabad: హైదరాబాద్ లో కార్ఖానా ప్రాంతానికి చెందిన జవేరియా రిజ్వానా తన కొడుకు మాజ్అమ్మద్, కూతురుతో కలిసి ఫంక్షన్ కి వెళ్ళింది. అర్ధరాత్రి ఫంక్షన్ నుంచి వచ్చేటప్పుడు ర్యాపిడూ ఆటోను బుక్ చేసుకున్నారు. అయితే, ప్యారడైజ్ దగ్గరకు రాగానే రిజ్వానా ప్రయాణిస్తున్న ఆటోను నలుగురు యువకులు వెంబడించారు.
మదర్సలోఉన్న పిల్లలు ఈ దేశం పిల్లలు అని మీ ఎస్పీ చెప్పగలరా అని ఎంపీ రఘునందన్ రావు అడిగారు. టోపీ పెట్టుకుంటే మనోడు అని కాపాడుతున్నారు.. అక్కడ మదర్సలో ఉండే 12 ఏండ్లలోపు పిల్లలకు హిందూ సమాజంపై ద్వేషం ఎందుకు..? అని ప్రశ్నించారు.
MLA Kunamneni: శాంతి చర్చలకు సిద్దమని మావోయిస్టులు పదే పదే ప్రతిపాదనలు పంపిస్తున్నప్పటికీ ఛత్తీస్ ఘడ్ సరిహద్దులోని కర్రెగుట్టలో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించడం సమంజసం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
పెళ్లికి వచ్చాడు.. అందరితో పాటు భోజనం చేశాడు.. అయితే, అతడి టార్గెట్ మాత్రం వేరు..పెళ్లిలో కలియతిరుగుతూనే అంతా గమనించసాగాడు.. చివరకు చదివింపుల సొమ్ము దాచిన బ్యాగ్తో ఉడాయించాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉడతా వారి కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. ఉడతా వెంకట్రావు తనయుడు రమేష్ పెళ్లికి ఆహ్వానించిన వారంతా వచ్చారు. బంధువులు, స్నేహితులు రాకతో కల్యాణ మండపం సందడిగా మారింది. వచ్చిన బంధువులంతా వధువరూలను ఆశీర్వదించి విందు ఆరగించి వెళ్తున్నారు. అటు తర్వాత ఉడతా…
Rajanna Sircilla District: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ సెక్రటరీ అధికారిని మిస్సింగ్ లెటర్ జిల్లాలో కలకలం రేపుతుంది. గ్రామ పంచాయతీ సెక్రటరీ కనిపించకుండా పోయి తన తండ్రికి పంపిన లెటర్ వారిని తీవ్ర భయందోళనకు గురి చేస్తుంది.
Extramarital Affairs: వివాహేతర సంబంధం నేరం కాదు.. ఇది ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు. గతంలో సుప్రీంకోర్టూ ఇలాంటి తీర్పే ఇచ్చింది. కానీ నైతికంగా తప్పయినా నేరం కాదని స్పష్టం చేసింది. వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇస్తూ కొన్ని కేసుల్లోనే ఈ తీర్పులు ఇచ్చాయి కోర్టులు.
Tirupati Police: తిరుమల శ్రీవారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇవాళ ( ఏప్రిల్ 21న) కీలక సూచనలు చేశారు.