వనస్థలిపురం అగ్ని ప్రమాదం కేస్ లో మలుపు చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంలో నిజం లేదని తేల్చింది ఫైర్ సిబ్బంది. ప్రభుత్వ ఉద్యోగి సరస్వతి బలవన్మరణానికి పాల్పడ్డింది. భార్య భర్త మధ్య గొడవ కారణంగా తనంతట తానే ఒంటికి నిప్పు అంటించుకుంది భార్య. ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేసి గాయాల పాలయ్యాడు భర్త బాలకృష్ణ. అయితే ఒక్కసారిగా మంటలు రావడం చూసి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు స్థానికులు. అయితే ఇది షార్ట్ సర్క్యూట్…
వివిధ కేసుల్లో సుమారు 40 కి పైగా నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ కాగా వాటినుండి తప్పించుకొనుటకు 15 సంవత్సరాలుగా అజ్ఞాత జీవితం గడుపుతున్న, ఒక ఘరానా మోసగాడిని వెంటాడి , వేటాడి కటకటాల పాలు చేసిన కరీంనగర్ పోలీసులు !! ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన విలన్, ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడిన తర్వాత, ఆ జీవితంతో తృప్తి పడక, అధికంగా డబ్బులు సంపాదించి కోటీశ్వరుడు కావాలనే దురాశతో,…
రాజేంద్రనగర్ సులేమాన్ నగర్ లో కొంతమంది యువకులు రెచ్చిపోయారు. విధులు నిర్వహిస్తున్న పోలీసుల పై దాడికి యత్నించారు పోకిరీలు. లాక్ డౌన్ టైమ్ అయిపోయినప్పటికి మాస్క్ లేకుండా హెల్మెట్ ధరించకుండా మోటర్ సైకిల్ పై వెళుతున్న యువకుడిని అడ్డగించిన పోలీసులు… ఎక్కడికి వెళుతున్నావని యువకుడిని ప్రశ్నించారు పోలీసులు. మా వాడి బండే ఆపుతావా అంటూ రోడ్డు పై వున్న బండరాయి తీసి కానిస్టేబుల్ పై దాడికి యత్నం చేశాడు. బండి తీసుకోవడానికి వెళ్లానని చెబితే వినరా అంటూ…
ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి భూవివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిపై నిన్న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుపై ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కాప్రా భూ వ్యవహారంతో తనకు సంబంధం లేదని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. అప్పట్లో ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్నారని తనకు ఎమ్మార్వో చెబితే ఆ విషయంపై పోలీసు అధికారితో మాట్లాడాతానని ఆయన వెల్లడించారు. తాను ప్రభుత్వ భూమి…
ఆనందయ్య మందు తయారీపై సందిగ్ధం కొనసాగుతోంది. ఆనందయ్య మందు హానికరం కాదని ఇప్పటికే ఆయుష్ గుర్తించిన సంగతి తెలిసిందే. ఆనందయ్య మందుపై విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ, తిరుమల ఆయుర్వేద కళాశాలలు మందుపై పరిశోధన ప్రారంభించాయి. ఆనందయ్య మందు తీసుకున్న 500 మంది నుండి వివరాలను సేకరిస్తున్నారు. పరిశోధన రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. పరిశోధనకు సంబందించిన రిపోర్టులు వచ్చేందుకు ఆలస్యం అవుతుంది కాబట్టి మందు తయారీ మరింత ఆలస్యం కావొచ్చని…
సొంత బావతో.. 16 సంవత్సరాల అమ్మాయికి పెళ్లి తలపెట్టిన తల్లిదండ్రుల ప్రయత్ననాన్ని కీసర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ పెళ్లి కాస్త ఆగిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలుకు చెందిన చిన్న కొండయ్య.. తండ్రి కేశవులు చనిపోడంతో తల్లితో కలిసి నాగారం రాఘవేంద్రకాలనిలో ఉంటూ, మేస్త్రి పని చేస్తూ జీవనము సాగిస్తున్నాడు. చర్లపల్లిలో నివాసం ఉంటున్న కొండయ్య.. చిన్న కొండయ్యకు మేనమామ వరుస అవుతాడు. దీంతో కొండయ్య దంపతులు గత సంవత్సరం 10వ తరగతి పాస్ అయిన తమ…
హైదరాబాద్ లో లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తుండటంతో, రోడ్లపైకి ఎవర్ని అనుమతించడం లేదు. రోడ్లపైకి అనవసరంగా వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వాహనాలను సీజ్ చేస్తామని పోలీసులు కఠినంగా హెచ్చరించారు. పోలీసులు రూల్స్ ను స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుండటంతో వాహనదారులు రోడ్లపైకి వచ్చేందుకు భయపడుతున్నారు. అనవసరంగా రోడ్లమీదకు వచ్చి ఇబ్బందులు పడేకంటే ఇంట్లోనే ఉండటం మంచిది అని చెప్పి బయటకు రావడం లేదు. దీంతో రోడ్లు బోసిపోయాయి.
హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. జూబ్లీహిల్స్ రోడ్డు నం. 41 లోని ఓ హోటల్ ఓయో రూంపై దాడులు చేసి ముగ్గులు సెక్స్ వర్కర్లను, ఇద్దరు విటులు, ఒక నిర్వహకుడిని పొలీసులు అరెస్ట్ చేశారు. అందిన సమాచారంతో పోలీసులు పక్కా ప్లాన్ వేసి..ఓయో రూంపై దాడులు చేశారు. వ్యభిచార గృహ నిర్వహకుడిని అశ్విన్ గా గుర్తించారు. విటులను అల్వాల్ కు చెందిన వ్యాపారి రాహుల్ సురాన, కూకట్ పల్లి నిజాంపేటకు చెందిన…
హైదరాబాద్ పాతబస్తీలో దారుణమైన ఘటన వెలుగుచూసింది.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.. హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలోని పిట్టలోళ్ళ బస్తీ పక్కనున్న చంద్రకాపురంలో ఈ ఘటన జరిగింది.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.. వీరి ఆత్మహత్యలకు ఆర్థిక ఇబ్బందులే కారణంగా అనుమానిస్తున్నారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కరోనా…