బ్రహ్మంగారి మఠానికి సంబందించి పీఠాధిపతి ఎంపిక కోసం వారసుల మద్య ఆదిపత్యపోరు జరుగుతున్నది. ఈ వివాదం తారాస్థాయికి చేరడంతో వివాదానికి చెక్ పెట్టేందుకు వివిధ మఠాలకు చెందిన పీఠాధిపతులు బ్రహ్మంగారి మఠానికి చేరుకున్నారు. శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామితో పాటు పలువురు పీఠాదిపతులు బ్రహ్మంగారి మఠానికి చేరుకున్నారు. ఇక ఇదిలా ఉంటే, ప్రస్తుతం మఠం ఆలయ పరిసర ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. అలయంలోకి ఎవరిని అనుమతించడంలేదు. వారసుల మద్య సయోధ్యను కుదిర్చి పరిస్థతిని చక్కదిద్దేందుకు పీఠాధిపతులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.