మైదుకూరు నియోజకవర్గంలో పోలీసుల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అని టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. పోలీసులు వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు…రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు. నియెజకవర్గంలోని టీడీపీ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు అని తెలిపారు. మొన్న జరిగిన మునిసిపల్ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిని అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులపై చట్ట పరమైన చర్యలకు వెళ్తున్నాం అని తెలిపిన ఆయన డిఎస్పీ, సిఐ, ఎస్సైల అక్రమాలపై కోర్టులో కేసులు వేశాం అని పేర్కొన్నారు. అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకొక తప్పదు అని హెచ్చరించారు.