నాంపల్లి నిలోఫర్ కేఫ్ సమీపంలో అయాన్ కురుషి రౌడి షీటర్ ను హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయాన్ ను హత్య చేశాక సంతోషకర వార్త అంటూ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పిన నిందితులు. నేడు మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు పోలీసులు. తన అక్క ప్రేమించి పెళ్లి చేసుకుందనే కోపంతో బావ మునావర్ ను 2020 లో హత్య చేసిన అయాన్ కురుషి. అప్పటి నుంచి కోర్ట్ కేస్ కు హాజరు అవుతున్నాడు అయాన్.
Also Read:Road Accident: శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, 15 మందికి గాయాలు!
తన బావ మునావర్ బంధువులు సైతం కోర్ట్ కు సాక్షులుగా హాజరవుతున్నారు. సాక్ష్యులను పలు మార్లు బెదిరించాడు అయాన్. కోర్ట్ కు వచ్చి సాక్ష్యం చెబితే మిమ్మల్ని కూడా మునావర్ లాగే చంపేస్తానని అయాన్ బెదిరింపులకు పాల్పడేవాడు. దీంతో అయాన్ ను ఎలాగైనా చంపేయాలని ప్లాన్ చేసి నడీ రోడ్ పై పట్టపగలే హత్య చేశారు మునావర్ బంధువులు. కోర్ట్ కేస్ వాయిదా పడటంతో స్కూటీ పై వస్తున్న అయాన్ పై క్రికెట్ బ్యాట్ తో దాడి చేసి కత్తులతో పొడిచి చంపేశారు నిందితులు.