ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 20 మంది మావోయిస్టులు హతమయ్యారు. 20 మంది మావోల్లో 11 మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తయింది. మిగతా మృతదేహాలకు కూడా పోస్ట్‌మార్టం జరుగుతోంది. చట్టపరమైన లాంఛనాలు పూర్తయ్యాక కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించనున్నారు. ప్రస్తుతం మృతదేహాలను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే కుటుంబ సభ్యులు అప్పగించనున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: ప్రెస్‌మీట్‌కు ముందు సీనియర్ మంత్రులతో మోడీ కీలక సమావేశం
ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. ఇప్పటికే పదుల కొద్దీ మావోయిస్టులు హతమయ్యారు. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో కూడా భారీగానే మావోయిస్టులు చనిపోయారు.
ఇది కూడా చదవండి: DGMO Meeting: ముగిసిన భారత్-పాక్ డీజీఎంవోల చర్చలు.. ఏం తేల్చారంటే..!