IT Company Fraud: హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో బోర్డు తిప్పేసిన కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ప్యూరోపాల్ క్రియేషన్స్ అండ్ ఐటీ సొల్యూషన్స్ పేరుతో నకిలీ కంపెనీ ఏర్పాటు చేశారు.. అయితే, కనీసం ఆఫీస్ కూడా ఏర్పాటు చేయకుండానే.. నిరుద్యోగులకు కేటుగాళ్లు ఎర వేశారు. ఫేక్ లొకేషన్ ను సదరు నిరుద్యోగులకు పంపించినట్లు గుర్తించారు. ఆ ఫేక్ కంపెనీ ఏర్పాటు చేసిన టీంలో మాజీ ఐటీ ఉద్యోగులు, హెచ్ఆర్ లు ఉన్నట్లు గచ్చిబౌలి పోలీసులు పేర్కొన్నారు. ప్రొఫెషనల్ గా ఐడీ కార్డ్స్, అపాయింట్మెంట్ లెటర్లు సృష్టించి నిరుద్యోగులకు ఇచ్చారు మోసగాళ్ళు.. నిజమేనని నమ్మి లక్షల రూపాయలు కట్టారని పోలీసులు తెలిపారు.
Read Also: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు
అయితే, ఒక్కొకరి నుంచి సుమారు 2 లక్షల నుంచి రెండున్నర లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 200 మంది వరకు బాధితులు ఉన్నారు. దాదాపు 4 కోట్ల రూపాయలు కాజేసి ఆ కేటుగాళ్లు బోర్డు తిప్పేసినట్లు పేర్కొన్నారు. ఇక, బాధితుల ఫిర్యాదుతో ఇప్పటికే కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు.. కంపెనీ ఏర్పాటు చేసిన మోసగాళ్ల కోసం గాలిస్తున్నారు. బోర్డు తిప్పేసి ఇప్పటికే వేర్వేరు ప్రాంతాలకు ఆ మోసగాళ్లు పారిపోయి ఉంటారని పోలీసులు చెబుతున్నారు.