Crime: కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీలో దారుణం చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలుడిని 6వ తరగతి విద్యార్థి కత్తితో పొడిచి చంపాడనే ఆరోపణలతో పోలీసులు అతడ్ని మంగళవారం నాడు అరెస్టు చేశారు. అయితే, వివరాల్లోకి వెళ్తే.. హుబ్లీలో ఓ స్కూల్ లో ఇద్దరూ కలిసి ఆడుకుంటున్నప్పుడు జరిగిన చిన్న గొడవ జరిగింది.. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ 6వ తరగతి పిల్లాడు ఒక్కసారిగా తన దగ్గర కత్తితో 9వ తరగతి స్టూడెంట్ ను పొడిచేశాడు. దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం తీవ్రంగా గాయపడిన విద్యార్థిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Read Also: S Jaishankar: విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు భద్రత పెంపు..
ఇక, 14 ఏళ్ల విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు మృతుడి తల్లికి వైద్యులు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడైన బాలుడిని జువైనల్ జస్టిస్ హోమ్‌కు పంపారు. ఈ సంఘటనపై పోలీసులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజలు తమ పిల్లలను సురక్షితంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పిల్లలు చిన్నప్పటి నుంచి క్రైమ్ ఆధారిత సినిమాలు, మొబైల్ ఫోన్లలో చూసి హింసకు ప్రభావం అవుతున్నారని పేర్కొన్నారు. ఈ సంఘటనతో ప్రతి ఒక్కరూ మేల్కొనాలి.. ఇది ఒక చిన్న పిల్లవాడిని నిందితుడిగా పేర్కొనాల్సి వస్తుందని హుబ్లీ పోలీస్ కమిషనర్ శశి కుమార్ చెప్పుకొచ్చారు.