పోలీసులను చూసి పరుగులు తీసిన డీఎస్పీ.. అసలు విషయం ఇది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలీసు డిపార్ట్‌మెంట్‌లో డీఎస్పీ అంటే మంచి ర్యాంకే.. ఆయనకు ఎక్కడికి వెళ్లినా తగిన గౌరవం, హోదా లభిస్తాయి.. అయితే, పోలీసులను చూసి ఓ డీఎస్పీ పరుగులు పెట్టారు.. అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోయే ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుచ్చి విమానాశ్రయం సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఓ కారు నుంచి రూ.11 లక్షలతో ఓ డీఎస్పీ పరుగులు తీశాడు.. తిరుచ్చి పుదుక్కొట్టై ప్రధాన రోడ్డు అయిన ఎయిర్‌పోర్ట్ సమీపంలో వాహనాల తనిఖీ కేంద్రం ఉండగా.. అక్కడ గురువారం ఉదయం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో వేగంగా వచ్చిన ఓ కారును నిలిపి తనిఖీ చేస్తుండగా, కారులో నుంచి కిందకు దిగిన ఓ వ్యక్తి పరుగులు పెట్టాడు..
అయితే, ఇది గమనించిన పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు.. పరిగెత్తిన వ్యక్తి డీఎస్పీ అని, స్నేహితులతో కలిసి రూ. 11 లక్షల నగదును తీసుకొని తిరుచ్చికి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.. అనంతరం మీడియాతో మాట్లాడిన సదరు డీఎస్పీ.. తనిఖీ కేంద్రంలో మఫ్టీలో ఉన్న పోలీసులను చూసి తాను విజిలెన్స్ అధికారులు అనుకున్నానని.. డబ్బుకు తగిన ఆధారాలు లేకపోవడంతో పరిగెత్తినట్లు పేర్కొన్నారు. దీంతో డీఎస్పీతో పాటు అతని ఇద్దరు స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. మరి విజిలెన్స్ అనుకుని పరుగులు పెట్టిన డీఎస్పీకి ఆ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది అనేదానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు.
Also Read
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
తాజావార్తలు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
-
Harish Rao: ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!