పోలీసులతో నాకు ప్రాణహాని ఉంది అని చింతమనేని ప్రభాకర్ అన్నారు. తాజాగా మీడియా సమావేశంలో చింతమనేని మాట్లాడుతూ.. నాకు సీఆర్పీఎఫ్ బలగాలతో రక్షణ కల్పించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా. నాపై అక్రమ కేసులు పెట్టడమే మీ ఫ్రెండ్లీ పోలీసింగా అని ప్రశ్నించారు. అక్రమ కేసులు సినిమా చూపించటంలో డీజీపీ రాంగోపాల్ వర్మను మించిపోయారు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్థిక నేరగాళ్లు ఎందరో ఉండగా మీడియా సమావేశంలో నాపేరే డీజీపీ ఎందుకు ప్రస్తావించారు అని ప్రశ్నించారు. 6093 ఆర్థిక నేరగాడి గురించి ప్రజలకు తెలిపే ప్రయత్నం ఎందుకు చేయలేదు. నాపై ఉన్న కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయండి. తెదేపా క్యాడర్ ను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు నన్ను బంతిలా వాడుకుంటున్నారు. ఓ ఎస్పీ చింతమనేనిపై కేసులు పెట్టేందుకు ముందుకు రావాలంటూ 1+1 ఆఫర్లు ప్రకటించారు అన్నారు. నాతప్పుంటే ఉరిశిక్షకైనా సిద్ధమే, కేసులు తొలగించమని దేహీ అని ఎవర్నీ అడగలేదు. నేను వనజాక్షి సమీపంలో కూడా లేనని ఆమె ఫిర్యాదులో పేర్కొంటే, అసెంబ్లీలో జగన్ రెడ్డి చెప్పిన కట్టుకథల్ని డీజీపీ వినిపించారు అని తెలిపారు చింతమనేని.