హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఢిల్లీలోని అధికారిక నివాసంపై ఇవాళ దాడి జరిగింది.. ఒవైసీ అధికారిక నివాసంపైకి దూసుకెళ్లిన హిందూ సేన కార్యకర్తలు.. గేట్ దగ్గర హంగామా చేశారు.. నేమ్ ప్లేట్, ఇంటి బయటికి ఉన్న అద్దాలను పగలగొట్టారు. హిందువులకు వ్యతిరేకంగా ఒవైసీ చేసిన వ్యాఖ్యలు తమ కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయని.. అందుకే అతని నివాసంపై దాడి చేశారని తెలిపారు హిందూ సేన అధినేత విష్ణు గుప్త.. కాగా, ఈ దాడిలో…
కామాంధులు రెచ్చిపోతున్నారు.. ఎక్కడ, ఎప్పుడు, ఎలాంటి వార్తలు వినవాల్సి వస్తుందో అనే ఆందోళనక కలిగించే పరిస్థితి నెలకొంది.. ఇక, ఈ మధ్య వరుసగా హైదరాబాద్‌లో వెలుగుచూస్తున్న దారుణమైన ఘటనకు ఆందోళనకు గురిచేస్తున్నాయి.. హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. రాజేంద్రనగర్ హైదర్‌గూడలో అభం శుభం తెలియని బాలికపై అత్యాచారయత్నం చేశాడో గుర్తుతెలియని యువకుడు. బాలిక కేకలు విని స్థానికులు అక్కడికి చేరుకున్న స్థానికులు.. కామాంధుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. అతన్ని…
ఏపీలో హనీ ట్రాప్ ముఠాను అరెస్ట్ చేసారు పోలీసులు. అమాయకులకు అమ్మాయిల తో ట్రాప్ ( హనీ ట్రాప్) చేస్తున్న ముఠాను అరెస్టు చేసారు ఏలూరు త్రి టౌన్ పోలీసులు. సుష్మ చౌదరీ, ఉమామహేశ్వరరావు, కుమారీ, షేక్ నాగూర్ అనే వారిపై కేసు నమోదు చేసారు. వారి వద్ద నుండి 25 గ్రాముల బంగారం,కారు, ఆరు సెల్ ఫోన్లు లక్షా యాబైవేల నగదు స్వాధీనం చేసుకున్నారు. లావాదేవీలలో గొడవలు కారణంగా సైనేడ్ తో గుంటూరు కి చెందిన…
మాజీ ముఖ్యమంత్రి ఇంటి పై దాడి కుట్ర జరిగింది అన్న మాటల్లో వాస్తవం లేదు అని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ అన్నారు. మూడు అంచల భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు పోలీస్ రక్షణ వలయం ఉంది. చంద్ర బాబు ఇంటికి వెల్లడం ఎమ్మెల్యే జోగిరమేష్ చేసిన ప్రయత్నం తొందరపాటు చర్యే… దానిపై చర్యలు ఉంటాయి. కానీ అక్కడ జరిగిన ఘర్షణ మాత్రం సరికాదు. ఎమ్మెల్యే కారు పై చెప్పుల తో రాళ్ల…
గచ్చిబౌలి లో మరోసారి రెచ్చిపోయారు నేపాలీ పనిమనుషులు. రాయదుర్గం పీయస్ పరిదిలోని టెలికం నగర్ లో ఉంటున్న గోవింద్ పటేల్ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఇంటి యాజమాని గోవింద్ పటేల్ మాట్లాడుతూ… తమ ఇంట్లో నాలుగు నెలల క్రితం నేపాల్ కు చెందిన లక్ష్మణ్, పవిత్ర లు పనిమనుషులుగా చేరారు. శనివారం శ్రీశైలం వెళ్ళి, ఆదివారం వచ్చే సరికే చోరీ జరిగింది. కిలో బంగారు ఆభరణాలు, 15 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. కిటికీ గ్రిల్ తొలగించి,…
ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది.. ఏడాది కూడా చిన్నారిని ఎందుకు చంపడం అనుకున్నారో ఏమో.. 9 నెలల చిన్నారిని వదిలేసి అంతా ఉరివేసుకున్నారు.. కానీ, ఆ ఇంట్లో ఎవరూ లేరు.. ఏం చేయాలి..? ఏం తినాలి..? ఏమీ తెలియని ఆ చిన్నారి ఐదు రోజుల పాటు ఆకలితో అలమటించిపోయింది… ఇంట్లో వేలాడుతోన్న మృతుదేహాల మధ్య ఆకలితో అలమటించి.. ఏడుస్తూ.. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.. ఈ హృదయ విదారకమైన ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.. ఈ ఘటనకు సంబంధించిన…
కెనడాలోని మాన్‌ట్రీల్ ల్లో హైదరాబాదు యువతి అవస్థలు పడుతుంది. రెండు నెలల గర్భవతైన దీప్తి రెడ్డి అనే యువతిని కెనడాలో వదిలేసి హైదరాబాద్ కు వచ్చాడు భర్త చంద్రశేఖర్ రెడ్డి. మెక్ గ్రిల్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ విభాగంలో పోస్ట్ డాక్ గా పని చేస్తున్నాడు చంద్రశేఖర్. ఆగస్టు 9న చంద్రశేఖర్ ఇండియాకు రాగా… 2021 ఆగస్టు 20న ఇండియన్ హై కమిషన్ కు దీని పై ఫిర్యాదు చేసింది దీప్తి. భర్త ఆచూకీ కోసం ట్విట్టర్ కేంద్రంగా…
హైదరాబాద్‌లో వినాయక శోభాయాత్రకు, నిమజ్జనానికి ప్రత్యేక స్థానం ఉంది… బాలాపూర్ నుంచి ప్రారంభమయ్యే వినాయక శోభాయాత్ర.. ఓల్డ్‌సిటీ చార్మినార్ మీదుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటుంది.. ఇక, ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో గణనాథులు ట్యాంక్‌బండ్‌కు తరలివస్తారు.. ఈసారి వినాయక నిమజ్జనానికి భారీ బందోస్తు ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం… వినాయక నిమజ్జానికి సిటీ పోలీస్ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.. హైదరాబాద్ వ్యాప్తంగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు…
నేడు భైంసా లో గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్త్ చేసారు. ఈ నిమజ్జనానికి మొత్తం 500 మంది పోలీసులతో బందోబస్తుతో పాటుగా 150 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టారు. అదనపు ఎస్పీ తో పాటు ఇద్దరు ఏ ఎస్పీలు 3 డిఎస్పీలు 11 మంది సీఐ లు 36 ఎస్సై లు 251 మంది కానిస్టేబుళ్లు 37 హోంగార్డు లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు అధికారులు. వీటితో పాటు 10 పికెటింగ్…
సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన తీవ్ర కలకలమే రేపింది.. వారం రోజుల పాటు ఆందోళనలు, నిరసనలు హోరెత్తాయి.. అయితే, నిందితుడిగా ఉన్న రాజు ఆత్మహత్యకు పాల్పడడంతో.. అంతా సద్దుమణిగింది.. అయితే, సింగరేణి కాలనీలో స్థానికులపై కేసు నమోదు చేశారు సైదాబాద్ పోలీసులు.. ఈ నెల 10వ తేదీన పోలీసుల విధులకు ఆటంకం కలిగించేలా చేసిన పలువురిపై కేసులు నమోదైంది… చిన్నారి మృతదేహాన్ని తరలించే సమయంలో పోలీసులను అడ్డుకున్నారు స్థానికులు.. ఆ రోజు…