చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుకున్నారు. దుబాయ్, షార్జా ప్రయాణీకుల వద్ద 1.20 కోట్ల విలువ చేసే 2 కేజీల బంగారం గుర్తించారు కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని పేస్టుగా మార్చి.. ఆ పేస్టు ను క్యాపసల్స్ లో నింపారు కేటుగాళ్లు. అయితే ప్రాణాలకు తెగించి క్యాపసల్స్ రూపంలో వున్న బంగారాన్ని మలద్వారంలో దాచారు కంత్రిగాళ్లు. అయితే చెన్నై ఎయిర్‌పోర్ట్ లో విమానం దిగగానే దర్జాగా బయటకు చెక్కేసే ప్రయత్నం చేసారు ఐదుగురు ముఠా సభ్యులు. వారి నడవడికలో అనుమానం రావడంతో ఐదుగురుని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్ లో విచారణ చేసింది కస్టమ్స్ బృందం. దాంతో మలద్వారం లో దాచిన బంగారం గుట్టును రట్టు చేసిన అధికారులు… ఆ బంగారం సీజ్ చేసి ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.