గంజాయి రవాణా జోరుగా సాగుతూనే ఉంది.. దీంతో.. గంజ విక్రయదారులపై సీరియస్‌గా ఫోకస్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు.. ‘ఆపరేషన్ గంజా’ పేరుతో నగరంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.. ఇప్పటి వరకు 23 మంది గంజాయి విక్రయదారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.. ఒకేసారి 23 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.. ఇక, గంజా ఫ్రీ హైదరాబాద్ గా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా.. ప్రత్యేక చర్యలకు పూనుకుంటున్న పోలీసులు.. గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఇవ్వాలనుకున్నా 94906 16555 నంబర్‌కు మెసేజ్ పంపాలంటూ హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పిలుపునిచ్చారు.