దేశంలో కరోనా కేసులు ఉగ్రరూపం దాల్చుతున్నది. కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఢిల్లీలో నైట్‌కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఈ వీకెండ్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అయితే, వీకెండ్ కర్ఫ్యూకు సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్నా ట్విట్టర్ ద్వారా సమాధానాలు ఇస్తున్నారు పోలీసులు. అత్యవసరమైతే తప్పించి బయటకు రావొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మాస్క్ ధరించడంతో…
హన్మకొండ చౌరస్తాలో ఇన్నోవా కారులో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. చాలా రోజులుగా రిపేర్ కోసం పక్కకు పెట్టిన ఇన్నోవాలో వ్యక్తి చనిపోయిన ఘటన పైన పోలీసు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.. సీసీ కెమెరాల పరిశీలించిన అనంతరం పోలీసులు ప్రాథమికంగా ఆత్మహత్యగా అంచనా వేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమ్మ గడ్డకు చెందిన రమేష్ అనే వ్యక్తి ఓ స్వీట్ షాపు లో పని చేసేవాడు.. తాగుడుకు బానిసగా…
సైబర్ నేరగాళ్ళ మోసాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక రూపంలో అమాయకులు నుండి అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా సీసీఎస్ సైబర్ క్రైం టీమ్ లు రెండు ముఠాల గుట్టు రట్టు చేశాయి..ఉద్యోగాల పేరుతో, బహుమతుల పేరుతో మోసాలు చేస్తున్న రెండు సైబర్ గ్యాంగ్ లను అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు.. ఢిల్లీ లోని ఓ కాల్ సెంటర్ పై రైడ్ చేసి 10 మందిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు నైజీరియన్లను…
మరోసారి ఏపీ పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్.. పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యానికి నిరసనగా నిర్వహించిన దీక్షలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీ పోలీసులపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.. పోలీసులు పార్టీ కండువాలు వేసుకున్నారని మండిపడ్డారు.. వ్యవస్ధ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో వుండిపోయింది.. ఇక్కడ పరిస్ధితులను చక్కదిద్దేందుకు కేంద్రం చూస్తోందని.. అందుకే రీకాల్ చేస్తారని చెప్పానని.. అది త్వరలోనే జరుగుతుందని…
తరచూ రోడు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. కొన్ని ఘటనలు మినహాయిస్తే.. ఎక్కువ ప్రమాదాలు తాగి వాహనాలు నడపడమే కారణంగా తేలుతోంది.. మద్యం సేవించి.. వాహనాలతో రోడ్లపైకి వచ్చి.. మెరుపు వేగంతో దూసుకెళ్తూ.. ఎంతోమంది ప్రాణాలు తీస్తున్నారు. అయితే, వాటికి చెక్ పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు పోలీసులు.. ఇప్పటి వరకు రాత్రి సమయంలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు చేస్తూ.. పట్టుబడినవారిపై కేసులు నమోదు చేస్తూ, వాహనాలు సీజ్ చేస్తూ వస్తున్న పోలీసులు.. ఇక, ఓ సమయమంటూ లేకుండా…
డబ్బుల కోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతున్న రోజులవి. మహబూబాబాద్ జిల్లాలో ఓ సుపారీ ముఠా హల్ చల్ చేసింది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కు యత్నించిన ఆ ముఠా సభ్యులు అడ్డంగా బుక్కయ్యారు.. వారిని పట్టుకొని చితకబాదిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ కిడ్నాప్ సంఘటన మహబాబూబాద్ లోని సాలార్ తండా వద్ద జరిగింది. రాకేశ్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి తన కారులో సాలార్ తండా కు బయలుదేరి వెళ్లాడు.…
తెలంగాణలో పాల్వంచ ఆత్మహత్య కేసు సంచలనం సృష్టించింది… బాధితుడు రామకృష్ణ ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియోతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను అరెస్ట్ చేశారు పోలీసులు.. ఆ వీడియోలో రామకృష్ణ బయటపెట్టిన అంశాలు కలకలం సృష్టించగా.. తాజాగా, మరో వీడియో తాజాగా బయటకు వచ్చింది. భార్య, పిల్లలతో సహా తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం వనమా రాఘవతే కారణమని ఆ వీడియోలోనూ స్పష్టం చేసిన రామకృస్ణ.. రాఘవతో పాటు…
కల్తీరాయుళ్లు దేన్ని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల్లో చాలా వరకు కల్తీ చేస్తున్న కేటుగాళ్లను అధికారులు ఎప్పటికప్పుడు దాడులు చేసి పట్టుకుంటున్నా కల్తీ రాయుళ్లు మాత్రం తమ బుద్ధిని మార్చుకోవడం లేదు. ప్రభుత్వం దీనిపై ఎన్ని ఆంక్షలు విధించిన కల్తీ రాయుళ్లు తమ పనిని ఏదేచ్చగా కొనసాగిస్తునే ఉన్నారు. చివరకు ప్రభుత్వం అమ్మే విజయ నెయ్యిని సైతం కల్తీ చేయడానికి ప్రయత్నించారు కల్తీకేటుగాళ్లు. Read Also: ధర్మయుద్ధంలో బీజేపీ గెలిచింది: లక్ష్మణ్ ఈ ఘటన హైదరాబాద్…
ఇంటర్నెట్లో పోర్న్ వీడియోల సైట్లను వీక్షించేవారిపై పోలీసు నిఘా అధికం చేయనున్నారు. మోబైల్, కంప్యూటర్, ఇంటర్నెట్ సెంటర్లలో పోర్న్ వీడియోలు చూసేవారితో పాటు ఆయా వీడియోలను షేర్ చేసేవారిని ఐపి ఆధారంగా గుర్తించి వారిపై ఐటి చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేసేందుకు సన్నద్థమౌతున్నారు. ఈక్రమంలో ఇంటర్నెట్లో పోర్న్ సైట్లను వీక్షించే వారిని ఆయా ఇంటర్నెట్ ఐపి ఆధారంగా గుర్తిస్తూ ప్రత్యేక నిఘా సారిస్తున్నారు. పోర్న్ సైట్ల వీక్షించడం వల్ల మహిళలపై లైంగిక వేధింపులు అధికమౌతున్నాయని…
ఏపీలో రాజకీయ కాక రేపుతోంది వంగవీటి రాధా రెక్కీ ఎపిసోడ్. ఈ కీలక అంశంపై మొదటి సారి స్పందించారు మంత్రి కొడాలి నాని. కొడాలి నాని సమక్షంలోనే తన హత్యకు రెక్కీ జరిగిందని వ్యాఖ్యలు చేసి సంచలనం రేపారు టీడీపీ నేత వంగవీటి రాధా. వంగవీటి రాధాకు ఏదైనా జరిగితే ప్రయోజనం కలిగేది చంద్రబాబుకే అన్నారు నాని. వంగవీటి రాధా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తనను హత్య చేయటానికి రెక్కీ జరిగిందని రాధా నా సమీక్షంలోనే…