ఆయేషా మీరా తల్లి సీజేఐ ఎన్వీ రమణకు బహిరంగ లేఖ రాశారు. 14 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నా ఫలితం లేదని లేఖలో పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తు మధ్యలోనే ఎందుకు ఆపివేసారో తెలియడం లేదన్నారు. నేరస్థులు ఎవరో తెలిసినా దర్యాప్తు సంస్ధలు పట్టుకోలేని స్ధితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థలో న్యాయం జరగదని మీరు ఆమోదముద్ర వేస్తే మూగజీవాలుగా మిగిలిపోతామని లేఖలో అయేషా మీరా తల్లి పేర్కొన్నారు.
ఇదిలా వుండగా… సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు సత్యంబాబు గత నెలలో లేఖ రాశారు. పోలీసులు, దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వ అధికారుల తీరుపై సత్యంబాబు లేఖ తీవ్ర విమర్శలు చేశాడు. జైభీమ్ సినిమాలో గిరిజనులకు అన్యాయం జరిగినట్టే తనకు జరిగిందని లేఖలో సత్యంబాబు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆయేషా మీరా హత్య కేసులో చేయని నేరానికి తాను 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించానని వాపోయారు. నష్ట పరిహారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించి నాలుగేళ్లైనా న్యాయం జరగలేదని పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను అభ్యర్ధించాడు సత్యంబాబు.