ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారు దుండగులు.. తిరుపతి సమీపంలో జనసేన కార్యకర్త సుహాన్ భాషాను అత్యంత కిరాతకంగా నరికి కత్తులతో నరికి చంపారు.. తిరుపతిలోని పేరూరు చెరువు వద్ద భాషాపై దాడి చేసి హతమార్చారు.. మృతుడు గాంధీపురానికి చెందిన సుహానా భాషాగా గుర్తించారు.. సమాచారం అందుకున్న జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు.. ఇక, స్థానిక నేతల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సుహాన్ భాషాను హత్య చేసి…
రాజేంద్ర నగర్ పీవీ ఎక్స్ ప్రెస్ పిల్లర్ నంబర్ 296 వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న హైమద్ అనే వ్యక్తి మృతి అక్కడికక్కడే మృతి చెందాడు. హుటాహుటిన రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎక్స్‌ప్రెస్ వేపై టూ వీలర్స్‌కు అనుమతి లేదు. ఆరంఘర్ నుంచి మెహదీపట్నం వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.కాగా పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా…
కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. తెలంగాణలో క్రమేపీ కరోనా ఉగ్రరూపం దాల్చడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా శాంతి భద్రతలు, ట్రాఫిక్ విధులు నిర్వర్తించే పోలీసులను కరోనా కలవరపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు1,400 మంది పోలీసులకు కరోనా రావడంతో డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌లో పోలీసుల్లో పాజిటివ్ ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 500 మందికి పైగా పోలీసులు కరోనా బారినపడ్డారు.…
సైబర్ నేరగాళ్లు ఎవ్వరిని వదలడం లేదు. ప్రముఖులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తికి సైబర్ చీటర్ ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం కలకలం రేపుతుంది. సీఎంఓ కార్యాలయంలో పనిచేస్తున్నట్టు సైబర్ ఛీటర్ అభిషేక్‌గా పరిచయం చేసుకున్నారు. ఖాదీ పరిశ్రమ సబ్సిడీ రుణాల కింద రూ. 5కోట్లు మంజూరైనట్లు చెప్పిన అభిషేక్.మంజూరైన రుణాలు కావాలంటే తన అకౌంట్లో డబ్బులు వేయాలని డిమాండ్ చేసిన సైబర్ చీటర్ అభిషేక్. Read Also:…
గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేత తోట చంద్రయ్య హత్య కేసు కలకలం సృష్టించింది.. అయితే, హత్య జరిగిన 24 గంటల్లోనే ఈ కేసును ఛేదించారు పోలీసులు.. మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేసినట్లు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ ప్రకటించారు.. ఈ హత్యకు ప్రధాన కారణం పాత తగాదాలు అని మా ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు తెలిపారు.. మృతుడు తోట చంద్రయ్య మరియు ప్రధాన నిందితుడు చింతా శివ రామయ్య…
కరోనా థర్డ్ వేవ్ ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది… సెకండ్ డోస్ వ్యాక్సిన్ కంప్లీట్ చేసుకున్న వారిపైనా కరోనా అటాక్ చేస్తుండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసు అధికారులతో పాటు పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేసే పోలీసు ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. వారం రోజుల్లోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్…
ఇక వైసీపీ అరాచకాల్ని సహించం, ఇప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడైనా మరో టీడీపీ కార్యకర్తపై చేయి వేస్తే పరిణామాలు వేరేగా ఉంటాయని హెచ్చరించారు టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడులో టీడీపీ నాయకుడు చంద్రయ్య హత్యను తీవ్రంగా ఖండించిన ఆయన… ఈ సందర్భంగా వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. రాష్ట్రంలో జగన్, పల్నాడులో పిన్నెల్లి హత్యా రాజకీయాల్ని పెంచి పోషిస్తున్నారని ఆరోపించిన అచ్చెన్నాయుడు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పల్నాడులో అరాచకాలు,…
దేశంలో కరోనా కేసులు ఉగ్రరూపం దాల్చుతున్నది. కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఢిల్లీలో నైట్‌కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఈ వీకెండ్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అయితే, వీకెండ్ కర్ఫ్యూకు సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్నా ట్విట్టర్ ద్వారా సమాధానాలు ఇస్తున్నారు పోలీసులు. అత్యవసరమైతే తప్పించి బయటకు రావొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మాస్క్ ధరించడంతో…
హన్మకొండ చౌరస్తాలో ఇన్నోవా కారులో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. చాలా రోజులుగా రిపేర్ కోసం పక్కకు పెట్టిన ఇన్నోవాలో వ్యక్తి చనిపోయిన ఘటన పైన పోలీసు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.. సీసీ కెమెరాల పరిశీలించిన అనంతరం పోలీసులు ప్రాథమికంగా ఆత్మహత్యగా అంచనా వేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమ్మ గడ్డకు చెందిన రమేష్ అనే వ్యక్తి ఓ స్వీట్ షాపు లో పని చేసేవాడు.. తాగుడుకు బానిసగా…
సైబర్ నేరగాళ్ళ మోసాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక రూపంలో అమాయకులు నుండి అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా సీసీఎస్ సైబర్ క్రైం టీమ్ లు రెండు ముఠాల గుట్టు రట్టు చేశాయి..ఉద్యోగాల పేరుతో, బహుమతుల పేరుతో మోసాలు చేస్తున్న రెండు సైబర్ గ్యాంగ్ లను అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు.. ఢిల్లీ లోని ఓ కాల్ సెంటర్ పై రైడ్ చేసి 10 మందిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు నైజీరియన్లను…