పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో తాగుబోతులు వీరంగం సృష్టించారు. బాగా తాగి వచ్చినవారంతా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ హడావిడి చేశారు. ఒకరిపై ఒకరు దాడిచేసుకుంటూ హల్చల్ చేశారు. లక్ష్మీ థియేటర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడే వున్న వ్యక్తులు ఈ దృశ్యాలను వీడియో తీశారు. మద్యం మత్తులో సీసాలు, రాడ్లతో కొట్టుకున్నారు. ఆర్టీసీ బస్సు కింద పడుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు మందుబాబులను అదుపులోకి తీసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనతో ఏం జరుగుతుందో తెలీక అయోమయానికి గురయ్యారు.