సిద్దిపేటలో కాల్పులు కలకలం సృష్టించాయి.. పట్టపగలే కాల్పులు జరిపి దారి దోపిడీకి పాల్పడ్డారు దుండగులు.. సిద్దిపేట అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యలయం ముందే ఈ ఘటన జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి రిజిస్ట్రేషన్ కోసం.. కారులో డబ్బులతో.. రిజిస్ట్రేషన్ కార్యాలయం గేట్ లోపలికి వచ్చాడు.. అప్పటికే దుండగులు కారును వెంబడిస్తూ వచ్చినట్టుగా తెలుస్తుండగా.. కారు ఆగిన వెంటనే కాల్పులు జరిపారు.. కారు డ్రైవర్‌పై మొదట కాల్పులు జరిపినట్టుగా సమాచారం.. ఆ వెంటనే కారు అద్దాలు పగలగొట్టి కారులో ఉన్న రూ.42.50 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు.. ఈ దోపిడీలో మొత్తం ముగ్గురు దుండగులు పాల్గొన్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.. ఇక, దుండగుల కాల్పుల్లో గాయపడిన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు స్థానికులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు..
Read Also: క్వారంటైన్ టైం అక్కడ 10 రోజులకు కుదింపు..