Granite Danda: లారీలు పట్టుకుంటే లక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేసేదే అక్రమం. ఆ అక్రమాన్ని అడ్డంగా క్యాష్ చేసుకుంటున్నారు ఆ చోటామోటా నేతలు. బిజినెస్ బాగుండటం.. గిట్టుబాటు అవుతుండటంతో కొత్త కొత్త ముఠాలు ఈ దందాలో చేరిపోతున్నాయి. పోటీ పెరగడంతో ఒకరి రహస్యాలను ఇంకొకరు పోలీసుల చెవిన వేస్తూ పెద్ద నేతలకు తలనొప్పిగా మారారట.
వేలకు వేలు వస్తుండటంతో కొత్త ముఠాలు ఎంట్రీ
ప్రకాశం జిల్లాలో కొత్తరకం దందాకు తెరలేచింది. ‘జిల్లా’లో తరలించే గ్రానైట్ లారీల నుంచి వైసీపీ ద్వితీయశ్రేణి నేతలు వసూళ్లు మొదలుపెట్టారు. ఎప్పుడు ఏ లారీ ఎక్కడికి బయలుదేరుతుందనే సమాచారం తెలుసుకోవడం.. దారిలో కాపు కాసేయడం డబ్బులు కొట్టేయడమే ఈ దందా. అయితే రూపాయి పెట్టుబడి లేకుండా రోజూ వేలకు వేలు వస్తుండటంతో కొత్త ముఠాలు బయలుదేరాయి. మాదంటే మాది అంటూ గొడవలు జరుగుతున్నాయి.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్‌తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
లారీల నిలిపివేతలో పరస్పరం దాడులు
మార్టూరు కేంద్రంగా గ్రానైట్‌ని అక్రమంగా తరించేందుకు అధికారపార్టీలో లోకల్ లీడర్ల మధ్య పోటీ పెరగడంతో బండారం బయటపడుతోంది. ఒకరికి చెందిన లారీల సమాచారాన్ని మరొకరు పోలీసులకు ఇస్తుండటంతో గొడవలు జరిగి పంచాయితీలు పార్టీ పెద్దల వద్దకి చేరుతున్నాయట. మార్టూరు మండలం రాజుపాలెంలో బిల్లులు లేకుండా వెళ్తోన్న ఓ వర్గానికి చెందిన లారీని మరోవర్గం నిలిపి వేయండంలో.. వ్యవహారం పరస్పరం దాడుల వరకు వెళ్లిందట.
నేతల వద్ద తమ పలుకుబడే పెట్టుబడి
గ్రానైట్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న రెండు వర్గాల్లో ఒకరు మంత్రి బాలినేని పేరును వాడుతుండగా మరొకరు తాము పర్చూరు వైసీపీ ఇంఛార్జ్ రావి రామనాథంబాబు వర్గీయులుగా చెప్పుకొంటున్నారట. అయితే వారికి నిజంగా నేతలు మద్దతుగా ఉన్నారా అంటే లేదట. వీరంతా ఆ నేతల వద్ద తమకున్న పలుకుబడిని పెట్టుబడిగా పెట్టి అక్రమ దందా సాగిస్తున్నట్టు సమాచారం. ఇటీవల కోనంకికి చెందిన ఓ నాయకుడు మంత్రి బాలినేని పేరు చెప్పి అక్రమ వ్యాపారం ప్రారంభించారట. అది తెలిసి కస్సుమన్న యద్దనపూడి, మార్టూరు మండలాలకు చెందిన రామనాథంబాబు వర్గంగా చెప్పుకొంటోన్న వైసీపీ నేతలు సర్పంచ్ భర్తపై దాడి చేశారు. తమకు అందాల్సినవి అందడంతో పోలీసులు ఈ ఘటనలో జోక్యం చేసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి.
రూల్స్ ప్రకారం లారీకి రూ.90 వేల నుంచి రూ.1.30 లక్షల రాయల్టీ కట్టాలి..!
బల్లికురవ మండలంలో స్టీల్ గ్రే గ్రానైట్ తవ్వకాలు గతకొన్నేళ్లుగా జరుగుతున్నాయి. స్టీల్ గ్రే గ్రానైట్‌కి మార్కెట్‌లో డిమాండ్ పెరగడంతో వ్యాపారుల మధ్య పోటీ నెలకొంది. తవ్వకాల తర్వాత ప్రభుత్వానికి కట్టాల్సిన రాయల్టీని ఎగ్గొట్టేందుకు బల్లికురువ, మార్టూరు కేంద్రంగా ఉన్న కటింగ్ ఫ్యాక్టరీలకు దొంగచాటుగా రాయిని తరలిస్తున్నారట. నిబంధనల ప్రకారం ఒక్కో లారీకి 90 వేల నుంచి లక్షా 30 వేల వరకు రాయల్టీ, జీఎస్టీ కట్టాలి. ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొట్టి గతంలో గ్రానైట్ రాళ్లు తరలించేందుకు గుంటూరు జిల్లా చిలకలూరిపేట కేంద్రంగా ఓ ముఠా నకిలీ వే బిల్లులు తయారు చేసింది. ఆ ఘటనలో నకిలీ వేబిల్లులు తయారు చేసిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ వే బిల్లులతో దాదాపు 290 కోట్ల వ్యాపారం చేసి.. ప్రభుత్వానికి 85 కోట్ల రాయల్టీని ఎగ్గొట్టినట్టు పోలీసులు గుర్తించారట.
లంచాలు ఇచ్చేందుకు లారీకి రూ.7 వేలు నుంచి రూ.10 వేలు వసూలు
ఆ కేసు తర్వాత రూటు మార్చిన అక్రమార్కులు గ్రానైట్‌ను తరలించేందుకు లోకల్‌గా ఒక్కో లారీకి ఏడు వేల నుంచి పదివేలు వసూలు చేస్తున్నారట. మైనింగ్, పోలీస్, విజిలెన్స్ అధికారులకు ఆ మొత్తం నుంచి సర్దుతున్నారట. లాభాలు భారీస్థాయిలో ఉండటంతో అధికారపార్టీ లీడర్లు రాత్రికి రాత్రి పదుల సంఖ్యలో లారీలను జిల్లా సరిహద్దులు దాటించేస్తున్నారట. వ్యాపారం లాభసాటిగా ఉండటంతో వారు వర్గాలుగా విడిపోవడం.. ఒకరి లారీల సమాచారాన్ని మరొకరు పోలీసులకు ఇస్తుండటంతో వ్యవహారం రచ్చకెక్కుతోందట. పట్టుకునేందుకు వచ్చిన పోలీసులకు సైతం మంత్రి బాలినేని పేరుతో పాటు రావి రామనాథంబాబు పేర్లు చెప్పి బెదిరిస్తుండటంతో ఏమీ చేయలేక వెనక్కు వెళ్లాల్సి వస్తుందట.
లారీలు పట్టుకున్న ఖాకీలు బాగానే ఆర్జిస్తున్నారా?
ఒకటిరెండు సందర్భాలలో లారీలను పట్టుకున్న పోలీసులు బాగానే ఆర్జిస్తున్నారట. అక్రమ వ్యాపారాన్ని పోలీసులు మంత్రి బాలినేనితోపాటు రామనాథంబాబు దృష్టికి తీసుకెళ్లారట. వారు ఎటొచ్చి వ్యవహారాన్ని నడుపుతోంది వైసీపీ నేతలే కావడంతో ఏం చెప్పాలో అర్థంకాక ఇరకాటంలో పడుతున్నారట. దీంతో గ్రానైట్ అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు కొత్త స్కెచ్‌లు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. మంత్రి బాలినేని కూడా అక్రమ రవాణా విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సంకేతాలు ఇచ్చేశారట. మంత్రి చెప్పారని పోలీసులు యాక్షన్ మొదలుపెడతారా? తమకొచ్చే పావలా బేడాలను వదిలేసుకుంటారా? అన్నది చర్చ. కేసులు పెడితే అధికార పార్టీ నేతల నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో పోలీసులకు, అధికారులకు తెలియంది కాదు. అందుకే గ్రానైట్ అక్రమ రవాణా మూడు లారీలు.. ఆరు రాళ్లగా సాఫీగా సాగిపోతోంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!