దొంగను పట్టుకున్న పోలీసే దొంగ అయితే ఎలా వుంటుంది. హాస్యాస్పదంగా వుంటుంది కదూ.. ఇలాంటి ఘటనే తెలంగాణలో చోటు చేసుకుందటే నమ్ముతారా? అవును మీరు విన్నది నిజమే.. చోరీ కేసులో పట్టు పడ్డ ఖాతాలో నుంచి ఓ.. పోలీసు బాసు డబ్బులు కాజేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చోరీ కేసులో ఓ పోలీసు ఇన్స్పెక్టర్ చేతివాటం చూపించాడు. ఏకంగా అరెస్టై జైలులో ఉన్న నిందితుడి అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేశాడు ప్రబుద్ధుడు.…
వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పదవతరగతి చదువుతున్న విద్యార్ధినిని అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు. ఆయువతి ఏడు నెలల గర్భవతి కాగా నిన్న శుక్రావారం ఓ ప్రవేట్ ఆసుపత్రిలో మగ శిశువును ప్రశవించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లో వెళితే.. వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం జిన్ గుర్తి లోని ఓ .. హై స్కూల్ లో విద్యార్ధిని పదవ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన యువకుడు…
తానొకటి తలిస్తే దైవం ఒకటి తెలుస్తుందనే సామెత బెట్టింగ్ ఈ వ్యవహారంలో జరిగిందని చెప్పవచ్చు. ముంబై హైదరాబాద్ హైదరాబాద్ చెన్నై కేంద్రాలుగా నడుస్తున్న బెట్టింగ్ వ్యవహారం బట్టబయలు చేసేందుకు పోలీసులు చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభం అయిన వెంటనే బెట్టింగ్‌ల జోరు పెరిగిపోతున్నది. ఇలాంటి బెట్టింగ్ లను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసేందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. Read Also: Kurnool: ఫేస్బుక్ ఫ్రెండ్‌కి బుద్ధి చెప్పిన యువతి అయితే హైదరాబాద్‌లో…
ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో జరిగిన వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసులో కీలక అంశాలను వెల్లడించారు పోలీసులు.. రెండు వర్గాల మధ్య నెలకొన్న ఘర్షణలో భాగంగా వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యకు గురయ్యారు. బజరయ్య సహకారంతో సురేశ్, హేమంత్, మోహన్‌లు కలిసి గంజి ప్రసాద్‌ను పథకం ప్రకారం హత్య చేసినట్టు పోలీసు విచారణలో తేలింది. Read Also: RBI: వడ్డీ రేట్లను పెంచిన ఆర్బీఐ.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..! రెడ్డి…
రేపల్లె రైల్వే స్టేషన్లో మహిళపై అత్యాచారాన్ని ఖండిస్తున్నా. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఏపీలో మహిళలపై రోజుకో అత్యాచారం.. పూటకో హత్య జరుగుతున్నాయన్నారు టీడీపీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్. రేపల్లెను గంజాయి హబ్ గా తయారు చేశారు.గంజాయి తాగి మహిళను గ్యాంగ్ రేప్ చేసారు అంటే ఏపీలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయి అనే దానికి అద్దంపడుతుంది. జగన్ రెడ్డి పాలనలో ఏపీ బీహార్ గా మారింది. దిశా చట్టం అంటూ మహిళా మంత్రులు మైకులు పట్టుకుని…
బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో గుంటూరు జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. ఈ కేసులో హంతకుడైన శశికృష్ణకు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది ప్రత్యేక న్యాయస్థానం.. శశికృష్ణను చనిపోయేంత వరకు ఉరి తీయాలని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. అయితే, రమ్య కేసు తీర్పు పై సోషల్ మీడియా వేదికగా స్పందించారు సీఎం వైఎస్ జగన్.. విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నామని…
ఏపీతో పాటు తెలంగాణలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు వెలువరించింది గుంటూరు జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. ఈ కేసులో హంతకుడైన శశికృష్ణకు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది ప్రత్యేక న్యాయస్థానం.. శశికృష్ణను చనిపోయేంత వరకు ఉరి తీయాలని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. ఈ కేసులో 10 గంటల వ్యవధిలో నిందితుడిని అరెస్ట్ చేశారు.. 2 రోజుల్లో ఫోరెన్సిక్, డీఎన్ఏ నిర్ధారణ చేశారు, దిశ కింద కొత్త ల్యాబులు,…
ఈ మధ్య తెలంగాణలో జరిగిన కొన్ని ఘటనల్లో పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి.. అయితే, ఓ యువకుడి ఆత్మహత్యకు కారణం అంటూ ఎస్ఐ గుర్రం ఉదయ్ కిరణ్ పై కేసు నమోదు చేశారు ములుగు పోలీసులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని ద్విచక్ర వాహనాల షోరూం వద్ద జరిగిన ఘర్షణ.. ఓ యువకుడి ప్రాణం తీసింది. 12 రోజుల క్రితం ద్విచక్ర వాహనానికి సంబంధించిన ఎన్వోసీ కోసం పెండ్యాల ప్రశాంత్…
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ.. దీంతో, ఢిల్లీ పరిమితం అనుకున్న ఆ పార్టీ.. మరో రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది.. ఇక, ఢిల్లీలో పూర్తిస్థాయిలో పనిచేసేందుకు ఎన్నో ఆటంకాలు ఉన్నాయి.. పంజాబ్‌లో పరిస్థితి వేరు.. తాము ఏంటో చూపిస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే అనేక సంస్కరణలు చేపడుతూ ముందుకు వెళ్తున్నారు సీఎం భగవంత్ మాన్ సింగ్.. ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆప్ ప్రభుత్వం.. ఆ…
సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాంగ్ వార్ చోటు చేసుకుంది. పాత గొడవల కారణంగా వారసిగూడ పోచమ్మ ఆలయం వెనుక వీధిలో సాయంత్రం కొంతమంది యువకులు వచ్చి వీధిలో యువకులతో గొడవ పెట్టుకుని కర్రలతో దాడి చేసి హంగామా సృష్టించారు. కర్రలతో పాటు రాళ్లతో దాడి చేసి పూల కుండీలను ధ్వంసం చేసి స్థానికులను భయబ్రాంతులకు గురి చేశారు. దీంతో స్థానికంగా ఉన్న మహిళలు డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దాడి…