ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారం తీవ్ర విధ్వంసానికి దారితీసింది.. అంబేద్కర్ పేరును ఆ జిల్లాకు జోడించడంపై ఓ వర్గం ఆందోళన చేస్తుండగా.. అంబేద్కర్ పేరును కొనసాగించాలంటూ దళితసంఘాలు నిరసనకు దిగుతున్నాయి.. అయితే, ఆంధ్రప్రదేశ్ పేరును కూడా మార్చేయాలంటూ సీబీఐ మాజీ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ మన్నెం నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరును “వైయస్సార్ ప్రదేశ్”గా మార్చమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి నా విన్నపం. అంటూ ట్వీట్ చేశారు.. ఇక, తెలుగును ఓ తెగులుగా భావించి దానిని పీకిపారవేస్తున్నాం కాబట్టి.. రాష్ట్రానికి ‘YSR LAND’ అనే ఇంగ్లీష్ పేరు పెడితే భేషుగ్గా ఉంటుందంటూ సెటైర్లు వేశారు.
Read Also: Amalapuram Violence: ఏడు కేసులు నమోదు.. 46 మంది అరెస్ట్..
అంతేకాదు, ఒకప్పుడు తెలుగు వారి తెలుగు సంభాషణ వింటుంటే తెలుగు వారికి “వాగ్భూషణం భూషణం” అనేది అక్షరాల నిజం అనిపించేది.. కన్యాశుల్కంలో రామప్పంతుల గారితో ఏక వచన ప్రయోగం ఎంతో అసభ్యకరమని గురజాడ అప్పారావు గారు చురక వేసారు.. వారే కనుక ఈ తరంలో పుట్టియుంటే ముమ్మాటికి ఆత్మహత్య చేసుకునేవారు.. అంటూ మరో ట్వీట్ చేశారు నాగేశ్వరరావు.. మొత్తంగా.. సీబీఐ మాజీ డైరెక్టర్ చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది.. ఆయనను సమర్థిస్తూ కొందరు కామెంట్లు పెడుతుంటూ.. ఆయనను టార్గెట్ చేసేవారు కూడా లేకపోలేదు.
https://twitter.com/MNageswarRaoIPS/status/1529317497802878976
ఒకప్పుడు తెలుగు వారి తెలుగు సంభాషణ వింటుంటే తెలుగు వారికి “వాగ్భూషణం భూషణం” అనేది అక్షరాల నిజం అనిపించేది.
కన్యాశుల్కంలో రామప్పంతుల గారితో ఏక వచన ప్రయోగం ఎంతో అసభ్యకరమని గురజాడ అప్పారావు గారు చురక వేసారు.
వారే కనుక ఈ తరంలో పుట్టియుంటే ముమ్మాటికి ఆత్మహత్య చేసుకునేవారు.
— M. Nageswara Rao IPS (Retired) (@MNageswarRaoIPS) May 25, 2022