Jubilee Hills Case: జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ కేసు.. సాదుద్దీన్‌కు 3 రోజుల కస్టడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై రేప్ కేసులో ఏ-1 నిందితుడు సాదుద్ధీన్ మాలిక్‌కు మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. సాదుద్దీన్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ఆరుగురు నిందితుల్లో సాదుద్దీన్ మాలిక్ ఒక్కడే మేజర్. దీంతో అతడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కోర్టు విచారణ జరిపి మూడు రోజులపాటు కస్టడీకి అనుమతించింది.
TSRTC: డీజిల్ సెస్ పెంపు.. పెరగనున్న టిక్కెట్ ధరలు
Also Read
ఇవాళ్టి నుంచి ఈ నెల 11 వరకు మూడు రోజుల పాటు జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. నేడు చంచల్ గూడ జైలు నుంచి సాదుద్దీన్‌ను కస్టడీలోకి తీసుకోనున్నారు. మరోవైపు జువైనల్ హోమ్‌లో ఉన్న ఐదుగురు నిందితులను సైతం వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని జువైనల్ కోర్టును పోలీసులు కోరారు. నేడు జువైనల్ కోర్టులో కస్టడీ ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టి తీర్పును వెలువరించే అవకాశం ఉంది. మైనర్ బాలికను ఏ విధంగా ట్రాప్ చేశారు.. అనే పలు అంశాలపై పోలీసులు నిందితులను విచారించనున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?