విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో సామూహిక అత్యాచారం ఘటన కలకలం సృష్టిస్తోంది.. ఈ వ్యవహారంలో ప్రభుత్వం, పోలీసులపై విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు.. అయితే, విజయవాడ జీజీహెచ్ లో సామూహిక అత్యాచార ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించటంతోపాటు ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్న ఆయన.. అలాగే దిశ చట్టం ఎప్పటి నుంచి అమలవుతుందో కూడా ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు..…
ఈమధ్యకాలంలో మహారాష్ట్రలో మావోయిస్టుల కదలికలు పెరిగాయి. అక్కడక్కడా వివిధ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో గ్రేహౌండ్స్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. కూంబింగ్ లు పెంచారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో నలుగురు మావోయిస్ట్ లు అరెస్టయ్యారు. గడ్చిరోలి జిల్లాలో టాక్టికల్ కౌంటర్ ఆఫెన్సివ్ క్యాంపెయింగ్ పోలీసులు నలుగురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు. ధోడ్ రాజ్ పరిడాని నెలగుండ అడవిలో యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ కొనసాగిస్తుండగా పోలీసులు ఈ అరెస్ట్ లు చేశారు. సీపీఐ మావోయిస్ట్ గ్రూప్ కి చెందిన నక్సల్స్…
సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ కోసం ప్రజల వాహనాలు స్వాధీనం చేసుకోవడం ఏంటి? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ముఖ్యమంత్రి పర్యటనకు ప్రభుత్వ వాహనాలు సమకూర్చలేని పరిస్థితి వచ్చిందా? అంటూ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఎవరి ఒత్తిడితో ప్రయాణికులను దింపి మరీ వాహనం తీసుకున్నారో స్పష్టత ఇవ్వాలి.. అని డిమాండ్ చేసిన ఆయన.. సీఎం జిల్లాల్లో పర్యటిస్తే ప్రయాణికులను నడిరోడ్డుపై దింపేసి వాహనాలు స్వాధీనం చేసుకునే…
మా పార్టీ నాయకులపై కేసులు పెట్టిన పోలీసులపై దండయాత్ర చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… హైదరాబాద్ మీడియాతో మాట్లాడిన ఆయన.. రేపు (21వ తేదీన) ఖమ్మం వెళ్తున్నామని వెల్లడించారు.. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేతలపై పీడీ యాక్టులు పెట్టిన కేసుల సంగతి తేలుస్తామన్న ఆయన.. ఇప్పటికే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా మాట్లాడారు.. అందరం కలిసి వెళ్తున్నాం.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, నేను.. ఇలా అందరం కలిసే వెళ్తాతం..…
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. గొటబాయ రాజపక్స ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని కొలంబోలోని అధ్యక్ష కార్యాలయం ముందు భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడి నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మంగళవారం హింసాత్మకంగా మారాయి. శ్రీలంక నైరుతి ప్రాంతమైన రాంబుక్కనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంధన ధరలు పెరగడాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ కేసులో కొత్త కొత్త కోణాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి… పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌కు టోనీ ఎంజెంట్లు డ్రగ్స్ చేరవేసినట్టు ఆధారాలు లభించాయి.. టోనీ ఏజెంట్లు బాబు షేక్, నూర్ మమ్మద్.. పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌కు డగ్ర్స్ సప్లై చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.. దేశవ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని డ్రస్ దందా చేస్తున్నారు నైజీరియాకు చెందిన టోనీ.. ఇక, టోనీ ప్రధాన ఏజెంట్ ముంబై బాబు…
మావోయిస్టులు మళ్లీ పంజా విసురుతున్నారు.. వరుసగా దాడులకు దిగుతున్నారు.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో దాడులకు పాల్పడుతున్నారు.. ఇన్న బీజాపూర్ జిల్లాలోని కుత్రు పోలీసు స్టేషన్ పరిధిలోని ధర్బా దగ్గర పోలీసు క్యాంపుపై మెరుపుదాడికి పాల్పడ్డ మావోయిస్టులు.. ఇవాళ బర్సూర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని మంగనార్ గ్రామంలో పీఎంజీఎస్‌వై రోడ్డు నిర్మాణంలో నిమగ్నమైన ఏడు ట్రాక్టర్లను తగలబెట్టారు. ఈ ఘటనకు మావోయిస్టు ఈస్ట్ బస్తర్ డివిజన్ కమిటీ చేసింది. స్థానికుల చెబుతున్న వివరాల ప్రకారం.. మహిళలతో సహా…
ప్రేమించుకున్నారు.. కానీ, వారికి పెళ్లికి కులం అడ్డంగా మారింది.. దీంతో.. ఆ ప్రేమ జంట ప్రాణాలు తీసుకుంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకులలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది… అయితే, ఆ ఇద్దరూ మైనర్లుగానే తెలుస్తోంది.. గత కొంతకాలంగా కనుకుల గ్రామానికి చెందిన ఇద్దరు ప్రేమించుకుంటున్నారు.. ఈ విషయం పెద్దల వరకు చేరింది.. కానీ, ఇద్దరి కులాలు వేరు కావడంతో అడ్డుచెప్పారు పెద్దలు.. పెళ్లికి ఒప్పుకునేది లేదని ఇరు కుటుంబాలు…
ఇంటర్నెట్ లోనే కాదు బహిరంగ ప్రదేశాల్లోనూ అశ్లీలత పెచ్చుమీరుతోంది. ఆపాల్సిన పోలీసులు దగ్గరుండి అశ్లీల డ్యాన్స్ లు వేయించడం వివాదాలకు దారితీసింది. అమ్యామ్యాలు పుచ్చుకొని చేజర్ల పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లి గ్రామంలో అర్థరాత్రి వేళ చేజర్ల పోలీసుల సాక్షిగా అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. శ్రీ రామ నవమి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సంబరాల్లో ఈ అశ్లీల నృత్యాలు రాజ్యమేలాయి. పోలీసులు ప్రభుత్వ ఆంక్షలని సైతం తుంగలో…