బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో గుంటూరు జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. ఈ కేసులో హంతకుడైన శశికృష్ణకు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది ప్రత్యేక న్యాయస్థానం.. శశికృష్ణను చనిపోయేంత వరకు ఉరి తీయాలని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. అయితే, రమ్య కేసు తీర్పు పై సోషల్ మీడియా వేదికగా స్పందించారు సీఎం వైఎస్ జగన్.. విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నామని…
ఏపీతో పాటు తెలంగాణలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు వెలువరించింది గుంటూరు జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. ఈ కేసులో హంతకుడైన శశికృష్ణకు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది ప్రత్యేక న్యాయస్థానం.. శశికృష్ణను చనిపోయేంత వరకు ఉరి తీయాలని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. ఈ కేసులో 10 గంటల వ్యవధిలో నిందితుడిని అరెస్ట్ చేశారు.. 2 రోజుల్లో ఫోరెన్సిక్, డీఎన్ఏ నిర్ధారణ చేశారు, దిశ కింద కొత్త ల్యాబులు,…
ఈ మధ్య తెలంగాణలో జరిగిన కొన్ని ఘటనల్లో పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి.. అయితే, ఓ యువకుడి ఆత్మహత్యకు కారణం అంటూ ఎస్ఐ గుర్రం ఉదయ్ కిరణ్ పై కేసు నమోదు చేశారు ములుగు పోలీసులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని ద్విచక్ర వాహనాల షోరూం వద్ద జరిగిన ఘర్షణ.. ఓ యువకుడి ప్రాణం తీసింది. 12 రోజుల క్రితం ద్విచక్ర వాహనానికి సంబంధించిన ఎన్వోసీ కోసం పెండ్యాల ప్రశాంత్…
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ.. దీంతో, ఢిల్లీ పరిమితం అనుకున్న ఆ పార్టీ.. మరో రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది.. ఇక, ఢిల్లీలో పూర్తిస్థాయిలో పనిచేసేందుకు ఎన్నో ఆటంకాలు ఉన్నాయి.. పంజాబ్లో పరిస్థితి వేరు.. తాము ఏంటో చూపిస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే అనేక సంస్కరణలు చేపడుతూ ముందుకు వెళ్తున్నారు సీఎం భగవంత్ మాన్ సింగ్.. ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆప్ ప్రభుత్వం.. ఆ…
సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాంగ్ వార్ చోటు చేసుకుంది. పాత గొడవల కారణంగా వారసిగూడ పోచమ్మ ఆలయం వెనుక వీధిలో సాయంత్రం కొంతమంది యువకులు వచ్చి వీధిలో యువకులతో గొడవ పెట్టుకుని కర్రలతో దాడి చేసి హంగామా సృష్టించారు. కర్రలతో పాటు రాళ్లతో దాడి చేసి పూల కుండీలను ధ్వంసం చేసి స్థానికులను భయబ్రాంతులకు గురి చేశారు. దీంతో స్థానికంగా ఉన్న మహిళలు డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దాడి…
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో సామూహిక అత్యాచారం ఘటన కలకలం సృష్టిస్తోంది.. ఈ వ్యవహారంలో ప్రభుత్వం, పోలీసులపై విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు.. అయితే, విజయవాడ జీజీహెచ్ లో సామూహిక అత్యాచార ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించటంతోపాటు ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్న ఆయన.. అలాగే దిశ చట్టం ఎప్పటి నుంచి అమలవుతుందో కూడా ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు..…
ఈమధ్యకాలంలో మహారాష్ట్రలో మావోయిస్టుల కదలికలు పెరిగాయి. అక్కడక్కడా వివిధ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో గ్రేహౌండ్స్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. కూంబింగ్ లు పెంచారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో నలుగురు మావోయిస్ట్ లు అరెస్టయ్యారు. గడ్చిరోలి జిల్లాలో టాక్టికల్ కౌంటర్ ఆఫెన్సివ్ క్యాంపెయింగ్ పోలీసులు నలుగురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు. ధోడ్ రాజ్ పరిడాని నెలగుండ అడవిలో యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ కొనసాగిస్తుండగా పోలీసులు ఈ అరెస్ట్ లు చేశారు. సీపీఐ మావోయిస్ట్ గ్రూప్ కి చెందిన నక్సల్స్…
సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ కోసం ప్రజల వాహనాలు స్వాధీనం చేసుకోవడం ఏంటి? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ముఖ్యమంత్రి పర్యటనకు ప్రభుత్వ వాహనాలు సమకూర్చలేని పరిస్థితి వచ్చిందా? అంటూ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఎవరి ఒత్తిడితో ప్రయాణికులను దింపి మరీ వాహనం తీసుకున్నారో స్పష్టత ఇవ్వాలి.. అని డిమాండ్ చేసిన ఆయన.. సీఎం జిల్లాల్లో పర్యటిస్తే ప్రయాణికులను నడిరోడ్డుపై దింపేసి వాహనాలు స్వాధీనం చేసుకునే…
మా పార్టీ నాయకులపై కేసులు పెట్టిన పోలీసులపై దండయాత్ర చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… హైదరాబాద్ మీడియాతో మాట్లాడిన ఆయన.. రేపు (21వ తేదీన) ఖమ్మం వెళ్తున్నామని వెల్లడించారు.. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేతలపై పీడీ యాక్టులు పెట్టిన కేసుల సంగతి తేలుస్తామన్న ఆయన.. ఇప్పటికే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా మాట్లాడారు.. అందరం కలిసి వెళ్తున్నాం.. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, నేను.. ఇలా అందరం కలిసే వెళ్తాతం..…