కాకినాడ జిల్లా పిఠాపురంలో దళిత గర్జనకు టీడీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అనుమతి నిరాకరించిన పోలీసులు. మాజీ ఎమ్మెల్యే వర్మను టీడీపీ ఆఫీస్ లోనే నిర్బంధించారు పోలీసులు. దీంతో ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చిన టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తాళాలు పగలగొట్టి వర్మను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులతో టీడీపీ క్యాడర్ వాగ్వాదానికి దిగింది. టీడీపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు పోలీసులు.
అనంతరం పిఠాపురంలో టీడీపీ కార్యాలయం నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మని ఇంటికి తీసుకుని వెళ్లి వదిలేశారు పోలీసులు. దీనిపై మండిపడ్డారు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ప్రతిపక్ష నేత ఇంటి గేటుకి తాడు కట్టి నిర్బంధించడం, ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలకు తాళం వేసి నాయకుల్ని అడ్డుకోవడం రాజారెడ్డి రాజ్యాంగంలో పోలీస్ వర్కింగ్ స్టయిల్. దళితుల హక్కులు కాపాడాలంటూ పిఠాపురం నియోజకవర్గంలో దళిత గర్జన సభ నిర్వహించడం నేరమా..?ఈ కార్యక్రమానికి వెళ్తున్న టీడీపీ దళిత నాయకుల్ని గృహనిర్బంధం చేయడం, పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ వర్మతో సహా వందమంది నాయకులు, కార్యకర్తలను తాళం వేసి పార్టీ కార్యాలయంలో బంధించడం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసుల నిర్బంధకాండను లోకేష్ తీవ్రంగా ఖండించారు.వైసీపీ నాయకులు యథేచ్ఛగా దళితులపై దాడులు, హత్యలు చేసినా ప్రభుత్వం, పోలీసులు స్పందించడం లేదు. వైసీపీ ప్రభుత్వం ఆపేసిన దళిత సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభించాలని, దళితులపై దాడులు ఆపాలని పోరాడుతున్న ప్రతిపక్షంపై ఉక్కుపాదం మోపడం జగన్ దళిత వ్యతిరేక ధోరణికి అద్దం పడుతోందని దుయ్యబట్టారు లోకేష్.
ప్రతిపక్ష నేత ఇంటి గేటుకి తాడు కట్టి నిర్బంధించడం, ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలకు తాళం వేసి నాయకుల్ని అడ్డుకోవడం రాజారెడ్డి రాజ్యాంగంలో పోలీస్ వర్కింగ్ స్టయిల్. దళితుల హక్కులు కాపాడాలంటూ పిఠాపురం నియోజకవర్గంలో దళిత గర్జన సభ నిర్వహించడం నేరమా?(1/3) pic.twitter.com/cBLkxTaTiP
— Lokesh Nara (@naralokesh) June 4, 2022
KTR: ఆయనది ఐరన్ లెగ్..అప్పుడు టీడీపీ..ఇప్పుడు కాంగ్రెస్ వంతు