పని భారం, అధికారుల వేధింపులు భరించలేక ఒక ఆర్టీసీ డ్రైవర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన బండి స్వామి గౌడ్ (35) కామారెడ్డి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఇంటి వద్దనే ఉన్నాడు. విధులకు హాజరు కావాలని ఆర్టీసీ అధికారులు తరచూ ఫోను ద్వారా స్వామికి సమాచారం అందిస్తున్నారు. విధులకు రాకపోతే…
తెలంగాణ సహా దేశవ్యాప్తంగా వరుసగా చిన్నారులు, అమ్మాయిలు, వృద్ధులు అనే తేడా లేకుండా అఘాయిత్యులు ఆందోళనకు గురిచేస్తున్నాయి.. జూబ్లీ హిల్స్ పబ్ కేసు మరువక ముందే.. హైదరాబాద్‌లో అదే తరహా కేసు ఒకటి ఇప్పుడు కలకలం రేపుతోంది… హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో గుజరాత్‌కు చెందిన యువతిపై అత్యాచారం జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది.. పోలీసులు చెబుతున్నప్రకారం పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Read Also: US Shooting: అమెరికాలోని అలబామా చర్చిలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి…
అగ్నిపథ్‌ను రద్దు చేసి ఆర్మీ పరీక్షను యథావిధిగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆర్మీ అభ్యర్థులు వేల సంఖ్యలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆందోళనకు దిగారు. బస్సులపై రాళ్లు రువ్వారు. స్టేషన్లో హౌరా ఎక్స్ ప్రెస్ రైలుకు నిప్పంటించారు. మొదటి మూడు ఫ్లాట్‌ఫాంలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఆర్మీ అభ్యర్థులు విధ్వంసంతో ప్రయాణికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఆర్మీ అభ్యర్థుల నిరసనలతో రైల్వేస్టేషన్ రణరంగంగా మారింది. అగ్నిపథ్ స్కీమ్ రద్దుచేయాలని, యధాతతంగా ఆర్మీ ఎగ్జామ్ పెట్టాల్సిందే అని డిమాండ్…
పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. ఇద్దరు హిందూ అక్కాచెల్లెళ్లపై అఘాయిత్యానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో గల బహవల్‌నగర్‌లో చోటుచేసుకుంది. బాధితురాళ్ల వయసు వరుసగా 16, 17 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. జూన్ 5వ తేదీన జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బహిర్భూమికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన అక్కాచెల్లెళ్లను తుపాకీతో బెదిరించి ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితులు ఉమైర్ అష్ఫాక్, కాషిఫ్…
సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.. ఈ కేసులో ఇప్పటి వరకు 17 మంది సాక్షులను గుర్తించి, 7 మందిని విచారించారు పోలీసులు.. మైనర్ బాలికను తీసుకెళ్లిన బెంజ్ కారును మైనర్ నడిపినట్లు గుర్తించారు. బెంజ్ కారు యజమానిపై కేసు నమోదు moFeki జూబ్లీహిల్స్ పోలీసులు.. అత్యాచారం జరిగిన ఇనోవా వాహనం వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మసి ఉల్లాఖాన్ కారుగా తేల్చారు. డ్రైవర్‌తో పాటు ఇనోవా కారు…
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి నిర్వాసిత గ్రామవాసులపై పోలీసులు లాఠీఛార్జి చేయడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న గౌరవెల్లి భూ నిర్వాసితులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జి చేయడం దారుణమని అన్నారు. లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో సీపీఐ పాత్ర కూడా ఉందని, అక్కడ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా తమ పార్టీ కాపాడిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం…
ఇటీవల మహిళలపై జరుగుతున్న ఘటనలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీపై ప్రతిపక్షనేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలు కామెంట్లు చేశారు. హైదరాబాద్ మెహిదీపట్నంలోని ఆసిఫ్‌నగర్‌లో అర్ధరాత్రి యువకులు హల్చల్ సృష్టించిన దానిపై టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దృశ్యం మన హైదరాబాద్ లోనే అంటూ ట్వీట్ చేశారు. ఆసిఫ్ నగర్ లో మందుబాబులు పోలీసు వాహనం ఎక్కి వీరంగం వేసిన వీడియోను పోస్ట్ చేశారు.…
హైదరాబాద్ జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచారం కేసులో దర్యాప్తును పోలీసులు వేగం పుంజుకుంది. ఇందులో భాగంగా ఇవాళ మొత్తం ఐదుగురు మైనర్లను కలిపి విచారణ చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగనుంది. ఘటన ఎలా జరిగింది ? అనే దానిపై ఇప్పటివరకు పోలీసులు వివరాలను సేకరించారు. విచారణలో భాగంగా మైనర్లతో పాటు కొందరు వ్యక్తులు చెప్పిన స్టేట్మెంట్లను రికార్డు చేశారు. కేసుతో ముడిపడిన సాంకేతిక, వైద్యపరమైన, శాస్త్రీయ ఆధారాలను…
గజరాజుకు కోపం వస్తే ఏం జరుగుతోందో.. ఎలా ప్రవర్తిస్తోందో ఎన్నో ఘటనలు వెలుగు చూశాయి.. ప్రశాంతంగా ఉండే గజరాజుకు కోపం వచ్చిందంటే.. ఆపడం ఎవరితరం కాదు.. విధ్వంసం సృష్టిస్తోంది.. పంట పొలాలు, వాహనాలు, ప్రజలు, జంతువులు.. ఇలా ఏది అడ్డువచ్చినా.. అడ్డుకోవడం కష్టమే.. అయితే, తాజాగా ఓ ఏనుగు ప్రవర్తించిన తీరు మాత్రం సోషల్ మీడియాకు ఎక్కింది.. ఔరా..! ఆ గజరాజు ఎందుకు ఇలా చేశాడు..? మహిళలను తొక్కి చంపడం ఏంటి..? ఆ తర్వాత అంత్యక్రియలను కూడా…