కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యేందుకు సిద్ధం అయ్యారు.. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు జారీ చేయగా.. ఇవాళ ఈడీ ముందుకు వెళ్లనున్నారు రాహుల్ గాంధీ.. ఇదే సమయంలో సత్యమేవ జయతే అంటూ భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ.. దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట ఆందోళనలకు పిలుపునిచ్చారు.. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమ…
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట్ వడ్డెర బస్తీలో పోలీసుల కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మాదాపూర్ జోన్ డిసిపి శిల్పవల్లి అధ్వర్యంలో 232 మంది పోలీసు సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. తనిఖీలతో పాటు ఇంటింటికి తిరుగుతూ కమ్యూనిటీ పోలీసింగ్ పై అవగాహన కల్పించారు. కార్డాన్ సెర్చ్ అనంతరం డిసిపి మాట్లాడుతూ.. సరైన ధృవపత్రాలు లేని 19 ద్విచక్ర వాహనాలు, నెంబర్ ప్లేట్ సరిగ్గా లేని 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని, అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న…
జూబ్లీహిల్స్ రేప్ కేసులో పోలీసులు తీసుకున్న సంచలన నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. అత్యాచారం వంటి పెద్ద నేరాలకు పాల్పడే వ్యక్తులు.. పెద్దవారిగానే శిక్షించబడాలని.. యువకుడిగా కాదని ఆయన అన్నారు. I welcome & support the stand of @TelanganaCOPs If you are adult enough to commit a crime as heinous as rape, one must also be punished as…
డబ్బు మనిషిని ఎలా మారుస్తుంది అంటే డబ్బు వస్తుందని అంటే ఎంత నీచానికి అయిన పాల్పడుతున్నారు. అలాంటి కలికాలం అయ్యింది. ఆస్తి కోసం సొంత వాళ్లను మోసం చేయడంతో పాటుగా దారుణంగా అంత మొందిస్తున్నారు. ఇప్పుడు జరిగిన ఘటన కూడా అలాంటిదే.. ఆస్తి కోసం సొంత బావ మరిదినే ఓ వ్యక్తి సుపారీ ఇచ్చి దారుణంగా హత్య చేయించాడు. ఈ నెల 2న కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన కొమ్ము రవి.. మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లి కాకతీయ…
జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై రేప్ కేసులో ఏ-1 నిందితుడు సాదుద్ధీన్ మాలిక్‌కు మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. సాదుద్దీన్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ఆరుగురు నిందితుల్లో సాదుద్దీన్ మాలిక్ ఒక్కడే మేజర్. దీంతో అతడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే…
తెలంగాణలో పోలీస్ అధికారులకు హైకోర్టు 4 వారాల జైలు శిక్ష విధించింది. నలుగురు కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు తీర్పు వెల్లడించింది. నలుగురు పోలీసు అధికారులకు జైలు శిక్ష విధించింది. నలుగురికి 4 వారాల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. భార్యాభర్తల వివాదం కేసులో సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని నలుగురిపై ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు సీఆర్పీసీ 41ఏ నోటీసు ఇవ్వలేదని పోలీసులపై అభియోగం నమోదైంది. Niranjan Reddy: త్వరలోనే ఇంగ్లీష్…
అతడు పాత నేరస్థుడు కాదు, అతనిపై కేసులు అస్సలు లేవు.. అక్కడేమి పెద్ద గొడవ కూడా కాలేదు. అస్సలు అతని తప్పేమీ లేదు. కేవలం తోపులాట. అయితే ఆ సీన్ ను ఓ సినిమాలో చూపించి నట్లుగా పోలీసులు వ్యవహరించారు. అవతలి వ్యక్తి ఫిర్యాదునే ప్రామాణికంగా తీసుకుని.. నిజానిజాలు పరిశీలించకుండా.. నేరం చేయని వాడిపై క్రూరంగా ప్రవర్తించారు. ఈ ఘటనను స్థానికుడు ఒకరు బాత్రూంలో ఉంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.…
కాకినాడ జిల్లా పిఠాపురంలో దళిత గర్జనకు టీడీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అనుమతి నిరాకరించిన పోలీసులు. మాజీ ఎమ్మెల్యే వర్మను టీడీపీ ఆఫీస్ లోనే నిర్బంధించారు పోలీసులు. దీంతో ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చిన టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తాళాలు పగలగొట్టి వర్మను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులతో టీడీపీ క్యాడర్ వాగ్వాదానికి దిగింది. టీడీపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం పిఠాపురంలో టీడీపీ కార్యాలయం నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మని ఇంటికి తీసుకుని…
గత కొద్ది రోజుల నుంచి పోలీసులు పబ్ లపై దాడులు నిర్వహిస్తున్నారు. రాత్రి సమయంలో పబ్ లలో ఆశ్లీల నృత్యాలు జరుగుతున్నాయని పబ్ లను సీజ్ చేస్తూ పలువురులను అదుపులో తీసుకుంటున్న పబ్ ల భాగోవతం ఏ మాత్రం ఆగడం లేదు. పట్టించుకోకుండా వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. పబ్ లలో ఆశ్లీల నృత్యాలు, సమయానికి మించి పబ్ లు నడపడం వంటివి జరుగుతునే వున్నాయి. పబ్‌కు కష్టమర్లను ఆకట్టుకునేందుకు పబ్బుల్లో అశ్లీల నృత్యాలతో గబ్బు…
హైదరాబాద్ లో ఏపీ జెమ్స్, జ్యువెలరీ సంస్థ కేసులో ఏ-5 నిందితుడిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ పేరును బంజారాహిల్స్ పోలీసులు తొలగించారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో శనివారం అభియోగ పత్రాలు సమర్పించారు. ఎలాంటి ఈ కేసులో ఆయన ప్రమేయం పై సాక్ష్యాధారాలు లేవని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10.5 పేర్కొన్నారు. ఏపీ జెమ్స్, జ్యువెలర్స్ కు చెందిన స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నించడంతో పాటు తనను చంపేందుకు ప్రయత్నించారంటూ సెక్యూరిటీ ఇన్‌ఛార్జి పి. నవీన్…