హైదరాబాద్ లో ఏపీ జెమ్స్, జ్యువెలరీ సంస్థ కేసులో ఏ-5 నిందితుడిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ పేరును బంజారాహిల్స్ పోలీసులు తొలగించారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో శనివారం అభియోగ పత్రాలు సమర్పించారు. ఎలాంటి ఈ కేసులో ఆయన ప్రమేయం పై సాక్ష్యాధారాలు లేవని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10.5 పేర్కొన్నారు.
ఏపీ జెమ్స్, జ్యువెలర్స్ కు చెందిన స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నించడంతో పాటు తనను చంపేందుకు ప్రయత్నించారంటూ సెక్యూరిటీ ఇన్ఛార్జి పి. నవీన్ కుమార్ గతనెల 17న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన వాంగ్మూలం మేరకు సినీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ను ఏ-1గా, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ ను ఏ-5 నిందితుడిగా ఎఫ్.ఐ.ఆర్.లో నమోదు చేశారు. ప్రాథమిక విచారణ, దర్యాప్తు అనంతరం సాక్ష్యాధారాలు సేకరించిన బంజారాహిల్స్ పోలీసులు టీజీ వెంకటేశ్ కు ఈ కేసుతో సంబంధం లేదంటూ స్పష్టం చేశారు.
కాగా ఏప్రిల్ 19న బంజారాహిల్స్ భూ కబ్జా యత్నం కేసులో ఏ5 నిందితుడిగా బిజెపి ఎంపీ టీజీ వెంకటేశ్ను నమోదు చేశారు. ఏపీ జెమ్స్ సంస్థ ప్రాపర్టీలోకి టీజీ వెంకటేశ్ మనుషులు అక్రమంగా చొరబడి.. ఆస్తులు ధ్వంసం చేయడంతో పాటు అడ్డుకోబోయిన సెక్యూరిటీ సిబ్బందిపైనా దాడి చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో నిందితులుగా టీజీ వెంకటేశ్తో పాటు ఆయన సోదరుడి కుమారుడు టీజీ విశ్వప్రసాద్, సుభాష్ పులిశెట్టి మిథున్, వీవీఎస్ శర్మ సహా 80 మందిని చేర్చారు. 2021లోనూ ఇదే తరహాలో దాడులకు యత్నించారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు.
ఇలా ఉండగా, కబ్జా కోసం వెళ్ళలేదు, సినిమా ఆఫీస్ ఓపెనింగ్ కోసం వెళ్లామని విశ్వప్రసాద్ మనుషులు చెబుతున్నారు. తమ దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవని , తాము ఎవరిపై దాడి చేయలేదని వీడియోలు కూడా విడుదల చేశారు. తనకు ఏమాత్రం సంబంధంలేని ఈ కేసులో తనను నిందితునిగా పోలీసులు పేర్కొనడం పట్ల టిజి వెంకటేష్ విస్మయం వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్ లో లేని తన పేరు రిమాండ్ రిపోర్ట్ లో ఎలా వచ్చినదని ప్రశ్నించిన విషయం తెలిసిందే..
Yadadri: భక్తుల రద్దీ.. కొండపైకి వాహనాలు ‘నో ఎంట్రీ’