ప్రధాని నరేంద్ర మోడీకి బెదిరింపు కాల్ వచ్చింది. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి.. మోడీని చంపుతానని బెదిరించాడని పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. బెదిరింపు కాల్ ను ట్రేస్ చేయడానికి తగిన చర్యలు తీసుకున్నారు.
Andhra Pradesh Crime: మహిళలపై నిత్యం ఏదో ఒక దగ్గర లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. పసికూనల నుంచి పండు ముసలి వరకు లైంగిక దాడులు జరుగుతోన్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. పనికూనలు, చిన్నారులు, బాలికలు, యువతులు, మహిళలు, వృద్ధులు ఇలా తేడా లేకుండా మృగాళ్లు రెచ్చిపోతున్నారు.. నిందితులను అరెస్ట్ చేస్తున్నా.. కఠిన శిక్షలు పడుతున్నా.. ఈ దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇక, మూగ జీవాలు, పశువులు, పెంపుడు జంతువులపై కూడా లైంగిక దాడులకు సంబంధించిన…
Vijayawada: పోలీసులంటే ప్రజల్లో అంతులేని గౌరవం ఉంది. కానీ కొందరి వల్ల డిపార్ట్ మెంట్ పరువు గంగలో కలిసిపోతుంది. కాసులకు కక్కుర్తిపడి కొందరు ఖాకీ చొక్కాకు తలొంపులు తెస్తున్నారు. అలాంటి హెడ్ కానిస్టేబుల్ చేసిన పనికి ఇప్పుడు డిపార్ట్ మెంట్ తలదించుకునే పరిస్థితి తలెత్తింది.
Cyber Crime: సైబర్ నేరాగాళ్లు రెచ్చిపోతున్నారు. మోసపూరిత ప్రకటనలతో అమాయకుల నుంచి లక్షల రుపాయలు కాజేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందొచ్చొని కొందరికి టోకరా వేస్తున్నారు. పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను నిలువునా దోచేస్తున్నారు. ఓ యువతి నుంచి ఏకంగా 20 లక్షలు, మరో యువకుడి నుంచి 40 లక్షల రుపాయలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. బెజవాడకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగినికి ఈ నెల 5న వాట్సాప్ నెంబర్ ద్వారా మేసేజ్ వచ్చింది.…
Radha Murder Case: ప్రకాశం జిల్లాలో సంచలనం రేపిన సాప్ట్వేర్ ఉద్యోగి రాధ హత్య కేసులో ఊహించని ట్విస్ట్ బయటపడింది. సినిమాను తలపించే ట్విస్ట్ వెలుగు చూసింది. కారుతో తొక్కించి.. బండరాళ్లతో కొట్టి.. సిగరేట్లతో కాల్చి దారుణంగా హత్య చేసిన ఈ కేసు మలుపు తిరిగింది. హత్య చేసి తప్పించుకోవాలని.. అనుమానం రాకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన నిందితులను పోలీసులు గుర్తించారు.భర్తే ఆమెను అత్యంత దారుణంగా చంపినట్టు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా వెలిగండ్ల…
విశాఖ పట్నం బీచ్ రోడ్డులో కలకలం రేపిన వివాహిత శ్రావణి మర్డర్ కేసును పోలీసులు చేదించారు. సుమారు ఉదయం నాలుగు గంటల సమయంలో బీచ్ రోడ్డు వద్ద మహిళ డెడ్ బాడీని గుర్తించామని క్రైమ్ డీసీపీ విద్యాసాగర్ నాయుడు చెప్పుకొచ్చారు.
గుంటూరు జిల్లా మంగళగిరి నగరపాలెం ఎస్ఐ రవితేజపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ రవితేజ ప్రేమ పేరుతో తనను మోసం చేశాడంటూ ఆమె ఆరోపించింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసానికి పాల్పడినట్లుగా సదరు యువతి పోలీసులకు ఇచ్చిన కాంప్లైంట్ లో పేర్కొంది. పెళ్లి చేసుకోమని అడిగినందుకు తనపై బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిపింది.
ప్రకాశం జిల్లాలో హత్యకు గురైన రాధ కేసు కలకలం రేపుతోంది.. వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు క్రాస్ రోడ్ వద్ద హత్యకు గురైన రాధ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు.. గ్రామంలో చౌడేశ్వరి అమ్మవారి తిరునాళ్ల కోసం వారం రోజుల క్రితం హైదరాబాద్ నుంచి సొంత ఊరికి వచ్చిన రాధ హత్య వెనుక ఉన్న కారణాలు ఏంటి? అనే విషయాలపై ఆరా తీస్తే సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి.. ఇంటి నుంచి వెళ్ళి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు…
AP Crime: ప్రకాశం జిల్లాలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని దారుణ హత్యకు గురైంది.. వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు క్రాస్ రోడ్ వద్ద సాఫ్ట్వేర్ ఇంజినీర్ రాధను దారుణంగా హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న రాధ.. ఇటీవలే తన సొంత గ్రామానికి వెళ్లింది.. అయితే, నిన్న సాయంత్రం నుండి కనిపించకుండా పోయింది.. దీంతో.. తెలిసినవారి ఇల్లు, బంధువుల ఇళ్లలో వెతికిన కుటుంబసభ్యులు.. ఎంతకీ ఆచూకీ దొరకకపోవడంతో.. చివరకు పోలీసులను ఆశ్రయించారు.. తమ కూతురు…
Telangana Secretariat: సచివాలయంలోకి వెళ్ళే వారికి ఇకపై డిజిటల్ పాస్లను ఇవ్వాలని సెక్యూరిటీ అధికారులు ఆలోచిస్తున్నారు. డిజిటల్ పాసులతో సచివాలయంలోకి అడుగు పెట్టిన వారు.. ఒక శాఖకు చెందిన అధికారులను మాత్రమే కలవడానికి అవకాశం ఉంటుంది. డిజిటల్ పాస్ తీసుకొని సచివాలయంలోకి వెళ్ళిన తరువాత గతంలో మాదిరిగా తనకు అవసరం ఉన్న ఇతర శాఖల అధికారులతో మాట్లాడి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని అనుకుంటే.. ఇకపై కుదరదు. సచివాలయంలోకి వెళ్ళాలి అనుకుంటే ఏ శాఖ అధికారులను కలవాలో ముందుగా…