రైల్లో ప్రయాణిస్తుండగా తాను నిమ్స్‌లో డాక్టర్‌నంటూ ఆ వృద్ధురాలితో మాట మాట కలిపాడు. అంతే ఇంకేముంది ఆమే అనారోగ్యం సమస్యలను అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత నీకున్న జబ్బును నయం చేస్తానంటూ మాయమాటలు చెప్పాడు.
బీహార్‌లోని భాగల్పూర్లోని ప్రత్యేక సెంట్రల్ జైలులో దారుణం జరిగింది. హత్యాయత్నం చేసి జైలులో ఉన్న భర్తను కలిసేందుకు వెళ్లిన భార్య.. భర్త ముఖం చూడగానే స్పృహతప్పి పడిపోయింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను మద్దతు కోరుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరో అడుగు ముందుకేశారు. ఇప్పటికే పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసిన ఆయన నేడు ఎస్పీ అధినేత అఖిలేశ్‌తో సమావేశం కానున్నారు.
మానవ అక్రమ రవాణా ప్రపంచ వ్యాప్తంగా వ్యవస్థీకృత నేరంగా మారింది. ప్రస్తుతం ప్రపంచంలో 3వ అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మారిపోయింది. మానవ అక్రమ రవణాను నిరోధించడంలో తెలంగాణ పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
పోలీసులపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీస్ మ్యానువల్ పాటించకుండా చట్టాన్ని తుంగలో తొక్కి.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా క్షేత్రస్థాయిలో పోలీసులు పనిచేస్తున్నారన్నారు. అంతేకాకుండా ప్రజల భావ వ్యక్తీకరణను అడ్డుకొని భయభ్రాంతులకు గురి చేయాడాన్ని ఆయన ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు పాదయాత్ర చేసిన ప్రతి గ్రామంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెడుతున్న తప్పుడు కేసుల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారని భట్టి పేర్కొన్నారు.
తెలంగాణ అస్తమా రోగానికి బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదం(మందు) పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి చేసింది. మృగశిర కార్తె అయిన 9వ తేదిన చేప మందును పంపిణీ చేయనున్నారు.
తరాలు మారినా మానుషుల్లో మార్పు ఇసుమంతైనా లేదు. ఇంకా కులమతాలు పట్టుకుని వేలాడుతున్నారు. దేశంలో నలుమూలలా ఇంకా కులవివక్ష కోరలు విప్పి బుసలు కొడుతూనే ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణాజిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. పంచాయతీ తీర్మానం సందర్భంగా గ్రామ పెద్ద మనుషులు చెప్పిన మాట వినలేదని రెండు కుటుంబాలను గ్రామం నుంచి వెలి వేశారు.
ఈ మధ్య కాలంలో టోల్గేట్ల దగ్గర గొడవలు పెరిగిపోతున్నాయి. టోల్గేట్ దగ్గర పేమెంట్ చేసే సమయంలో కొంత ఆలస్యం అవుతుండటంతో ప్రయాణీకులు ఓపిక లేకుండా టోల్ సిబ్బందిపై దాడులకు దిగుతున్నారు.
ఆకట్టుకున్నాయి. దుర్గం చెరువు వద్ద డ్రోన్ షో వీక్షకులను కనువిందు చేసింది. కేబుల్ బ్రిడ్జిపై ఒకేసారి 500 డ్రోన్స్ ప్రదర్శించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.