కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తన నోటి మాటలతో ఎప్పుడు ఏదొక హాట్ కామెంట్ చేస్తూనే ఉంటారు. ఆయన మాట్లాడిన యాస కానీ.. ఆయన చేసే బీహేవియర్ కు కొందరు జనాలు ఫిదా అవుతున్నారు. మొన్నటికి మొన్న నేను సినిమాల్లోకి రావాలని ఉందని.. అవకాశం వస్తే వస్తానంటూ ఓ సినిమా ఫంక్షన్ లో మాట్లాడారు. అంతేకాకుండా ఏదైనా ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళితే అక్కడున్న వాతావరణాన్ని బట్టి అక్కడి జనాలను తనదైన శైలిలో జోష్ తెప్పిస్తారు. సరే ఇదంతా ఒక ఎత్తైతే.. ఇప్పుడు మాట్లాడింది పోలీసుల పైన. ఆయన ఎలాంటి కామెంట్స్ చేశారో చూద్దాం.
Also Read : GHMC: లైగికంగా వేధించిన సూపర్ వైజర్.. పారిశుధ్య కార్మికులు ఆందోళన
తాజాగా మంత్రి మల్లారెడ్డి పోలీసులనుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. బొజ్జ ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వొద్దని.. హోం మంత్రి మొహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్ లను కోరారు మంత్రి మల్లారెడ్డి. అంతేకాకుండా పోలీసులు ఫిట్ నెస్ పెంచుకోవడానికి పోలీస్ స్టేషన్లలోనే జిమ్ లు ఏర్పాటు చేయాలని అన్నారు. తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ ప్రస్తుతం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, మన పోలీసులు బాగా పని చేస్తున్నారని, కేసులను తొందరగా పరిష్కరిస్తున్నారని పొగడ్తల వర్షం కురిపించారు.
Also Read : Krithi Shetty: అందానికే అద్దంలా.. హాట్ లుక్స్‌తో బేబమ్మ మెస్మరైజ్
అంతేకాకుండా.. పోలీసులు తమ మాదిరి మంచి ఫిట్ గా ఉండాలని చెప్పారు మల్లారెడ్డి. పోలీసులను చూస్తే దొంగలు భయపడిపోవాలని అన్నారు. పోలీసులు స్మార్ట్ గా ఉండాలన్నారు. చూస్తేనే భయపడేలా ఉండాలన్నారు. అయితే మంత్రి మాటలకు హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్ నవ్వుకున్నారు. ఏదేమైనా మల్లన్న నోట వచ్చే మాటలకు ఎవరైనా అవాక్కువాల్సిందే.