తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువులో డ్రోన్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్ చిత్రాలు ఆకట్టుకున్నాయి. దుర్గం చెరువు వద్ద డ్రోన్ షో వీక్షకులను కనువిందు చేసింది. కేబుల్ బ్రిడ్జిపై ఒకేసారి 500 డ్రోన్స్ ప్రదర్శించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. జూన్ 3న రైతు దినోత్సవం ఘనంగా జరుపుకున్న ప్రజానికం.. జూన్ 4న సురక్షా దినోత్సవం జరుపుకున్నారు. ఈ వేడుకలో భాగంగా ఆదివారం సాయంత్రం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దగ్గర లేజర్, త్రీడీ షోను ప్రదర్శించారు.
Also Read : OPEC Plus: సౌదీ అరేబియా నిర్ణయంతో భారత్కు గట్టి ఎదురుదెబ్బ.. పెట్రోల్ ధరలు ఇక తగ్గనట్లే
ఆ లేజర్ షోలో తెలంగాణ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఎంతగా అభివృద్ధి చెందిందో తెలుపుతూ.. వాటి విజువల్స్ ను ప్రదర్శించారు. మొదటగా దశాబ్ది ఉత్సవాల లోగోను చూపిస్తూ.. ఆ తర్వాత తెలంగాణ కోసం ఎందరో తమ ప్రాణాలను అర్పించిన వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం, తెలంగాణ సచివాలయం, కాళేశ్వరం ప్రాజెక్టు, వేములవాడ మల్లన్న స్వామి, సీఎం కేసీఆర్, టీహబ్, పోలీసుల లోగో, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం, సైబరాబాద్ పోలీస్ లోగో, షీ టీమ్స్ లోగో.. ఆఖరికి జై తెలంగాణ జై భారత్అనే నినాదంతో ఈ లేజర్ షో ముగిసింది. ఈ లేజర్ షోను చూసేందుకు వచ్చిన ప్రజలు.. ఆ షోను చూసి ఆనందం, కరతాల ధ్వనులతో తెలంగాణ వేడుకలను జరుపుకున్నారు.
Also Read : Andhrapradesh: నేడు ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ
Drone-Show on the Occasion of Telangana Dashabdi Utsavalu at Durgam Cheruvu #TelanganaSurakshaDiwas
https://t.co/3KQKu9y20d— Cyberabad Police (@cyberabadpolice) June 4, 2023