Minister Talasani: తెలంగాణ అస్తమా రోగానికి బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదం(మందు) పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి చేసింది. మృగశిర కార్తె అయిన 9వ తేదిన చేప మందును పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. ఈనెల 9న మృగశిర కార్తె సందర్భంగా బత్తిన సోదరుల చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం తరుఫున అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కి వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి మంగళవారం సమీక్షించారు.
Read also: Polavaram Project: ఏపీకి గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం.. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అదనపు నిధులు
చేప ప్రసాదం కోసం మూడు రోజుల ముందే ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకున్న హర్యానా, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారితో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. చేప ప్రసాదం పంపిణీ కి ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ఆంధ్ర పాలకులు అరకొర ఏర్పాట్లు చేసేవారని.. దాంతో చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. చేప ప్రసాదం కోసం గతంలో కంటే అధికంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బత్తిన హరినాద్ గౌడ్ కుటుంబ సభ్యులు 250 మంది చేప ప్రసాదం పంపిణీ చేస్తారని చెప్పారని, వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులను అందజేయనున్నట్లు వెల్లడించారు.
Read also: Mumbai : వైద్య చరిత్రలో మిరాకీల్..నాలుగు గంటలు శ్రమించి బ్రతికించారు..
చేప ప్రసాదం కోసం అవసరమైన చేప పిల్లలను మత్స్య శాఖ ఆధ్వర్యంలో సరఫరా చేయనున్నట్లు తెలిపారు. బారికేడ్లు, విద్యుత్ సరఫరా, పోలీసు బందోబస్తు, తాగునీరు అందుబాటులో ఉంచుతామని వివరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేకంగా జీహెచ్‌ఎంసీ(GHMC) పారిశుధ్య సిబ్బందిని నియమించామన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసు శాఖ పలు చర్యలు తీసుకుంటుందని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ల ఏర్పాటు తో పాటు అంబులెన్స్ లను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఇక్కడకు వచ్చే వారికి పలు స్వచ్చంద సంస్థలు అల్పాహారం, భోజనం ఉచితంగా అందించనున్నాయని తెలిపారు.