ఢిల్లీలోని సాక్షి హత్య కేసును విచారిస్తున్న ఢిల్లీ పోలీసులకు భారీ ఊరట లభించింది. నిందితుడు సాహిల్ సాక్షిని 20కి పైగా పొడిచి చంపిన కత్తిని రిథాలా నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా వెలుగులోకి వచ్చింది. నార్త్ వెస్ట్ ఢిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో ఆదివారం సాక్షిపై సాహిల్ కత్తితో దాడి చేశాడు. అనంతరం సాక్షిని రాయితో చితకబాది దారుణంగా హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన సాహిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read : Telangana Formation Day Celebrations: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. ముస్తాబైన గ్రేటర్
ఈ కేసులో ఢిల్లీ పోలీసులు సాక్షికి చెందిన 10 మందికి పైగా స్నేహితుల వాంగ్మూలాలను పోలీసులు తీసుకున్నారు. వీరిలో అజయ్ అలియాస్ జబ్రూ, నీతూ, ప్రవీణ్ ఉన్నారు. సాహిల్ మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు సీసీటీవీలో కనిపించిన 8 మందిని గుర్తించారు. వారి వాంగ్మూలాలను కూడా పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. గురువారం సాహిల్ కు కోర్టు మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. సాహిల్‌ను పోలీసులు విచారించగా.. అతను హత్యకు ఉపయోగించిన కత్తి స్వాధీనం చేసుకున్నారు. అంతే కాదు సాహిల్ హత్య చేసిన తర్వాత బులంద్‌షహర్ చేరుకున్న మార్గాన్ని కూడా పోలీసులు గుర్తించారు. హత్య అనంతరం కత్తిని రితాలాలోని పొదల్లో పడేశాడు.
Also Read : AP CM Jagan: నేడు సీఎం జగన్ గుంటూరు పర్యటన
సాక్షి శరీరంపై 34 గాయాల గుర్తులు కనిపించాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు. షాహాబాద్ డెయిరీలోనే అద్దె ఇంట్లో సాహిల్ తన కుటుంబంతో ఉంటున్నాడు. సాక్షి, సాహిల్ మధ్య సంబంధాలున్నట్లు విచారణలో తేలింది. అయితే కొంతకాలంగా వీరి రిలేషన్ షిప్ లో గ్యాప్ వచ్చింది. దీనికి కారణం మరో బాలుడు ప్రవీణ్ గా గుర్తించారు. సాక్షి గతంలో ప్రవీణ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది.. కానీ మళ్లీ అతను సాక్షితో కలిసి తిరుగుతున్నారు. దీంతో అది తట్టుకోలేకపోయిన సాహిల్ సాక్షిని తిరిగి తనతో ఉండాలని కోరాడు.. దీనికి ఆమె నిరాకరించడంతో సాహిల్ పదే పదే సాక్షిని వేదించాడు. దీంతో సాక్షి ఆమె స్నేహితుడు జాబ్రూ సాహిల్‌ను బెదిరించారు. దీంతో సాక్షిని సాహిల్ హత్య చేశాడు.