San Francisco: శాన్ ఫ్రాన్సిస్కో మిషన్ జిల్లాలో కాల్పులు .. 9 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
San Francisco: శాన్ ఫ్రాన్సిస్కోలోని మిషన్ డిస్ట్రిక్ట్ పరిసరాల్లో కాల్పులు జరగడంతో 9 మంది గాయపడ్డారు. ఇది కావాలని లక్ష్యంగా చేసుకొని పాల్పడిన ఘటన అని పోలీసులు భావిస్తున్నారు. కాల్పుల్లో గాయపడిన బాధితులను శాన్ ఫ్రాన్సిస్కో జనరల్ హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిపారు.
కాల్పుల బాధితులు 9 మంది ఉన్నారని నిర్ధారించగలిగామని.. వారందరూ బయటపడతారని భావిస్తున్నామని శాన్ ఫ్రాన్సిస్కో పోలీసు విభాగం ఒక ట్వీట్‌లో తెలిపింది.
Read also: NCP: అజిత్ పవార్‌కి చెక్.. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్..
Also Read
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
- Bill Gates: ఏఐతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం! బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక
- Houthi War: సౌదీకి పాకిస్తాన్ దూరం.. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్!
- Trump-Jinping: జిన్‌పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
బ్లాక్ పార్టీ కొనసాగుతున్నప్పుడు కాల్పులు జరిగాయని.. బాధితులందరూ ప్రాణాలతో బయటపడతారని శాన్ ఫ్రాన్సిస్కో పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ ఈవ్ లౌక్వాన్‌సతితయ ఒక వార్తా సమావేశంలో తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కో బోర్డ్ ఆఫ్ సూపర్‌వైజర్స్ శాసన సహాయకుడు శాంటియాగో లెర్మా ప్రకారం, బాధితుల్లో కనీసం ఐదుగురు ఆసుపత్రి పాలయ్యారని.. ఐదుగురు క్షతగాత్రులలో ఒకరు శుక్రవారం రాత్రికి శస్త్రచికిత్స జరిగిందని.. నలుగురు వ్యక్తులు స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారని చెప్పారు.
Read also: Pakistan: పాకిస్తాన్ బడ్జెట్ వాస్తవికంగా లేదు… ఇమ్రాన్ ఖాన్ పార్టీ నేతలు
రాత్రి 9 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. బట్టల రిటైలర్ డైయింగ్ బ్రీడ్ హోస్ట్ చేసిన బ్లాక్ పార్టీ వెలుపల ఘటన జరిగింది. ఇప్పటి వరకు పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదు. కాల్పులకు ఘటనకు సంబంధించి విచారణను నిర్వహిస్తున్నామని శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలు తెలియగానే మీడియకు విడుదల చేయబడతాయని చెప్పారు. సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు తుపాకీ గాయాలతో బాధపడుతున్న అనేక మంది బాధితులను గుర్తించినట్టు పోలీసులు ప్రకటనలో తెలిపారు. బాధితులను స్థానిక ఏరియా ఆసుపత్రులకు తరలించి చికిత్స చేసేందుకు అధికారులు వైద్యులను అక్కడికి పిలిపించారు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!