జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటన షెడ్యూల్ మారింది. ఇవాళే ఆయన రాష్ట్రానికి వస్తున్నట్లు ప్రకటించారు. నేడు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. వారాహి యాత్ర ఏర్పాట్లు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పోలీసు ఆంక్షలపై పవన్ కల్యాణ్ చర్చించనున్నారు. యాగాన్ని రేపు నిర్వహించాలా..? లేక ఎల్లుండి నిర్వహించాలా..? అనే అంశం పైనా నిర్ణయం తీసుకోనున్నారు. వారాహి యాత్రకు ఓ రోజు ముందుగానే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యా్ణ్ వెళ్లనున్నారు.
Read Also: Notice To Wrestlers: మీ దగ్గర ఆధారాలుంటే ఇవ్వండి.. రెజ్లర్లను కోరిన ఢిల్లీ పోలీసులు
అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనం ముందుకు వెళ్తున్నారు.. వారాహి యాత్రకు సిద్ధం అయ్యారు.. ఈ నెల 14వ తేదీన వారాహి యాత్ర స్టార్ట్ కానుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో నుంచి ఈ వారాహి యాత్ర ప్రారంభం కానుంది. దీంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పోలీసులు అలర్ట్ అయ్యారు. అమలాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఈనెల 10వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈనెల 30వ తేదీ వరకు పోలీస్ సెక్షన్ 30 అమల్లో ఉంటుందని డీఎస్పీ అంబికా ప్రసాద్ ప్రకటించారు. ఇక, ఈ సమయంలో ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు.
Read Also: Digital Payments: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ అగ్రస్థానం
కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఈనెల 14వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నేపథ్యంలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న వారాహి యాత్రలో ఉమ్మడి జిల్లాలో 8 నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. అయితే ఇప్పటికే జనసైనికులు వారాహి యాత్ర ఏర్పాట్లు, యాత్ర సాగే రూట్‌లో తగిన ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు.