తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కీలక ప్రకటన చేసింది. అభ్యర్థులకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కు సంబంధించి పూర్తయినట్లు తెలిపింది. మరోవైపు అభ్యర్థుల వయసు సడలింపు వివాదం చివరి దశలో తెరమీదికి వచ్చింది.
అతనో పోలీసు.. అతను డ్యూటీలో భాగంగా ఈ- చలాన్లు విధిస్తుంటారు. ఇలా చలాన్లు విధించగా వచ్చిన డబ్బులను వారు ప్రతి రోజూ బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అలా డిపాజిట్ చేసిన డబ్బుల్లో నుంచి పోలీసులకు అవసరమైన సమయంలో స్టేషనరీ ఇతర అవసరాలకు ఆ నిధులను ఉపయోగించుకుంటారు.
హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి శామ్యూల్ ప్రసాద్ ఇంట్లో జరిగిన భారీ చోరీ కలకలం సృష్టిస్తోంది. ఈ కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. ఎస్సై కృష్ణను అదపులోకి తీసుకోనిలో పోలీసులు విచారిస్తున్నారు. సురేందర్ ను విచారించడంతో వెలుగులోకి ఎస్సై కృష్ణ వ్యవహారం వచ్చింది. సురేందర్ అనే వ్యక్తితో కలిసి 100 కోట్ల ఆస్థి కొట్టేసేందుకు ఎస్సై కృష్ణ స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది.
హైదరాబాద్ లోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేనగర్ నాలా ప్రక్కన పడిఉన్న అమ్మోనియం గ్యాస్ సిలిండర్ లీక్ అయింది. అయితే, గ్యాస్ పీల్చిన 10 మందికి అస్వస్థతకు గురి కావడంతో వారిని బీబీఆర్ హాస్పటల్ కు తరలించారు. ఈ ప్రమాంలో ఐదుగురు స్వల్ప అస్వస్థతకు గురైన వారిని చికిత్స అనంతరం డిచార్చ్ చేశారు.
ప్రస్తుతం ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. ఇక చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ఊరుకుంటారా? దాంతో సెల్ఫీనో లేకపోతే రీల్స్ చేయడమో చేస్తుంటారు. అలా చేసిన వాటితో కొందరు పాపులర్ అవుతారు.. మరికొందరు వాటితో చిక్కుల్లో పడతారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమురంభీం జిల్లా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. గత రెండు రోజులుగా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సర్వం సిద్ధం చేశారు. ఐదేళ్ల తర్వాత జిల్లాకు వస్తుండడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో జోష్ వచ్చింది. ఇవాళ (శుక్రవారం) మధ్యాహ్నం 12 గంటలకు ఆసిఫాబాద్‌కు రానున్న సీఎం కేసీఆర్ తొలుత కొమురం భీం చౌక్‌కు చేరుకుని.. అక్కడ కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయనకు నివాళులర్పిస్తారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో కత్తి పోట్లు కలకలం దుమారం రేపాయి. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పట్టపగలే కొందరు యువకులు బీభత్సం సృష్టించారు. జనాలు చూస్తు్ండగానే ఆ దుండగులు ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.