తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గోల్కొండలో ప్రారంభమైన బోనాలు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుతున్నాయని తెలిపారు. బోనాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. రాజకీయాలకు అతీతంగా బోనాల జాతర కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు దేవాలయాలకు నిధులు ఇవ్వడం లేదని ఆయన తెలిపాడు.
Read Also: Venu Yeldandi : కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు పడ్డాను..
తెలంగాణ ప్రభుత్వం బోనాలకు ప్రత్యేక నిధులు కేటాయించింది అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికి ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా బోనాలు చేసి మన సంప్రదాయాన్ని చాటి చెప్పారు.. కుల మతాలకు అతీతంగా ఐక్యతతో బోనాల ఉత్సవాలు చేసుకోవాలి.. ప్రశాంతంగా బోనాలు జాతర జరుపుకోవాలని కోరుకుంటున్నాను మంత్రి తలసాని తెలిపారు.
Read Also: Indrakaran Reddy: సింహావాహిని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా బోనాల పండగ జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో బోనాల పండగ సందర్భంగా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆలయాలకు వస్తున్నా.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఈసారి మంచిగా వర్షలు పడాలని అమ్మవారిని కోరుకున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అమ్మవారి చల్లని ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో సుభిక్షంగా ఉంటుందని ఆయన వెల్లడించారు.